IND vs AUS: న్యూజిలాండ్‌తో ఘోర ఓట‌మి.. క‌ట్ చేస్తే.. ఆస్ట్రేలియాకు ముందే చేరుకున్న టీమిండియా స్టార్ క్రికెట‌ర్..

|

Nov 11, 2024 | 3:26 PM

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ నవంబర్ 22న పెర్త్‌లో జ‌ర‌గ‌నున‌న్న‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభించనుంది.

IND vs AUS: న్యూజిలాండ్‌తో ఘోర ఓట‌మి.. క‌ట్ చేస్తే..  ఆస్ట్రేలియాకు ముందే చేరుకున్న టీమిండియా స్టార్ క్రికెట‌ర్..
Virat Kohli
Follow us on

నవంబర్ 22న పెర్త్ లో జ‌ర‌గ‌నున‌న్న‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే ముందే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఈ స్టార్ ఇండియన్ బ్యాటర్ అంద‌రీ కంటే ముందే పశ్చిమ ఆస్ట్రేలియా నగరానికి చేరుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందే కోహ్లి ఆదివారం పెర్త్‌లో అడుగుపెట్టగా, మిగిలిన భారత జట్టు సోమవారం ఆస్ట్రేలియాకు చేరనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభించనుంది.ముందుగా శనివారం ముంబై విమానాశ్రయంలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో విరాట్ కోహ్లీ కనిపించాడు. అతను పెర్త్‌కు బయలుదేరిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారింది. అయితే త‌న పిల్ల‌ల‌ను కొంద‌రు ఫోటోలు తీయ‌డం ప‌ట్ల కోహ్లీ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

కోహ్లీ జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది కంటే చాలా ముందుగానే డౌన్ అండర్‌కు చేరుకున్నప్పటికీ, ప్రారంభ టెస్ట్‌లో రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. రోహిత్ తనకు రెండవ బిడ్డ పుట్టిన కారణంగా ఆప్టస్ స్టేడియంలో ప్రారంభ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని గతంలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో ప్రధాన కోచ్ గౌతం గంభీర్ దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ అతను తప్పుకుంటే, ఆస్ట్రేలియా సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నపేసర్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని గంభీర్ తెలిపారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన స్వదేశీ సిరీస్‌లో కోహ్లీ 93 పరుగులు మాత్రమే చేశాడు.

మ‌రిన్ని క్రికెట్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..