Virat Kohli: కింగ్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. ఈ ఫీట్‌ను సాధించిన మొదటి క్రికెటర్ అతనే.. మది అదేమిటంటే..?

|

Nov 30, 2022 | 1:26 PM

కోహ్లి భారత ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫోటోలు లేదా వీడియోలతో అభిమానులను అలరించేలా పోస్ట్‌లు పెడుతుంటాడు. ఆ అభిమానంతోనే అనుకుంటా.. సోషల్ మీడియా వేదికలలో ఒకటైన ఫేస్‌బుక్‌లో అతనికి ఇప్పుడు..

Virat Kohli: కింగ్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. ఈ ఫీట్‌ను సాధించిన మొదటి క్రికెటర్ అతనే.. మది అదేమిటంటే..?
Virat Kohli
Follow us on

భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీకి అభిమానులతో పాటు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు. క్రికెట్ మైదానంలో అతను కొట్టే షాట్లకే కాక సోషల్ మీడియాలో అతను  పెట్టే పోస్టకు కూడా చాలా మంది అభిమానులు, ఫాలోవర్లే  ఉన్నారు. అతను షాట్ ఎప్పుడు కొడతాడా అని క్రికెట్ అభిమానులు వేచి చూసినట్లే అతని పోస్ట్ కోసం కూడా నెటిజన్లు ఎదురుచూస్తుంటారు.  కోహ్లి భారత ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫోటోలు లేదా వీడియోలతో అభిమానులను అలరించేలా పోస్ట్‌లు పెడుతుంటాడు. ఆ అభిమానంతోనే అనుకుంటా.. సోషల్ మీడియా వేదికలలో ఒకటైన ఫేస్‌బుక్‌లో అతని  పాలోవర్ల  సంఖ్య ఇప్పుడు 50 మిలియన్లకు చేరింది ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీకి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో  కూడా  ఖాతాలు ఉన్నాయి. 

అయితే అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.  కాగా, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 505 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెస్సీ 381 మిలియన్ల అభిమానులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 225 మిలియన్ల ఫాలోవర్లతో  కోహ్లి, నాల్గో స్థానంలో 187 మిలియన్లతో నేమర్ జూనియర్ కొనసాగుతున్నారు. క్రీడపై ఉన్న ప్రేమ ఖచ్చితంగా అభిమానులను ఆయా ఆటగాళ్ల సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు కట్టిపడేస్తుంది. పోస్ట్‌లను పెట్టి అభిమానులతో చిన్న చిన్న విషయాలను పంచుకోవడం ద్వారా సదరు ఆటగాళ్లకు ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.  అందుకే వారు పెట్టే ప్రతి పోస్ట్‌కు సోషల్ మీడియా కంపెనీలు భారీ ఫీజులనే చెల్లిస్తాయి.

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత.. కోహ్లీ క్రికెట్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నాడు . ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ పర్యటనకు అతను దూరం వహించాడు.  అయితే డిసెంబర్ 4 నుంచి కోహ్లీతో సహా భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ ‌ఆతిథ్య జట్టుతో  3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. రానున్నప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరడం కోసం, ఈ టెస్ట్ సిరీస్ గెలవడం చాలా అవసరం .

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..