టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గొంతు మారిపోయింది. అతను మాట్లాడిన వీడియోలో స్వరం మారిపోయినట్లు తెలుస్తుంది. హీలియం బెలూన్ గాలి పీల్చి అతను మాట్లాడడంతో గొంతు మారింది. ప్యూమాతో తన బ్రాండ్ అసోసియేషన్‌లో అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పలు ప్రశ్నాలకు కోహ్లీ హీలియం బెలూన్ వాయిస్‌లో సమాధానమిచ్చాడు. ప్రైవేట్ జెట్ ఉందా అనే ప్రశ్న నుంచి చిన్నతనంలో ఎలా చదువుకున్నాడు అనే ప్రశ్నాలకు కోహ్లీ సమాధానం చెప్పాడు. అతను ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో ‘మనీ హీస్ట్’లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.
మీరు బ్లాక్ వాటర్ తాగుతున్నారా అని అడగగా.. ” నేను కొన్ని సార్లు ప్రయత్నించాను, కానీ నేను రెగ్యులర్‌గా తాగను, కానీ మేము ఇంట్లో ఆల్కలీన్ వాటర్ తాగుతామని చెప్పాడు. ” వీడియో మధ్యలో బెలూన్‌లోని గ్యాస్‌ను పీల్చుతూ కీచక స్వరం మాట్లాడారు. ఈ మొత్తం వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే ట్విట్టర్‌లో 24 వేలకు పైగా లైక్‌లను వచ్చాయి.
On a lighter note?
Helium Balloon Voice#ad pic.twitter.com/144estOGM5— Virat Kohli (@imVkohli) December 22, 2021
Read Also.. Year Ender 2021: ప్రపంచ క్రికెట్‌లో మరుపురాని క్షణాలు.. వివాదాలే కాదు.. అరుదైన రికార్డులూ ఈ ఏడాది సొంతం..!