India vs Hong Kong, Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత ఇన్నింగ్స్ లో సూర్య టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. కాగా సూర్యకుమార్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బౌండరీ వద్దకు వెళ్లిన విరాట్.. సూర్యకుమార్ దగ్గరకు రాగానే ‘టేక్ ఏ బౌ’ అంటూ ప్రశంసించాడు. దీంతో సూర్య కోహ్లీని హగ్ చేసుకున్నాడు. అనంతరం చప్పట్లు కొట్టి సూర్యను అభినందించాలంటూ గ్యాలరీలోని ప్రేక్షకులను కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Virat Kohli shows respect and bows down to Surya ♥️ pic.twitter.com/c3r0N0LZ12
ఇవి కూడా చదవండి— Sharma Ji Ka Ladka (@Brahman_Kuldip) August 31, 2022
కాగా ఈ మ్యాచ్ లో సూర్యతో పాటు విరాట్ కూడా రాణించాడు. సుమారు ఆరు నెలల తర్వాత ఓ మ్యాచ్ లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తం 44 బంతులు ఆడిన విరాట్ 3 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 31వ హాఫ్ సెంచరీ. వీరిద్దిరు మూడో వికెట్‌కు వేగంగా 98 పరుగుల చేయడంతో టీమిండియా మొదట 192 పరుగుల భారీస్కోరు సాధించింది. ఆతర్వాత హాంకాంగ్ 152 పరుగులకే పరిమితమైంది.
#SuryakumarYadav #ViratKohli? when you make king bow down to you by your batting best moment of the game great gesture from king kohli #AsiaCupT20 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/ZbgrKbqYjW
— Rudra pratap singh (@Rudra1268) August 31, 2022
Greatest Achievement For Surya the ? bows down ???❤
Arrogant, aggressive Virat kohli For you guy’s.? pic.twitter.com/ALjNdkdwX5
— Shamsi (MSH) (@Shamsihaidri1) August 31, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..