Virat Kohli: కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ.. భావోద్వేగాన్ని ఆపుకోలేక తోడైన డివిలియర్స్.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోన్న వీడియో

|

Oct 12, 2021 | 10:07 AM

Virat Cried: మైదానంలో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ ఏడుస్తూ కనిపించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయన సంగతి తెలిసిందే.

Virat Kohli: కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ.. భావోద్వేగాన్ని ఆపుకోలేక తోడైన డివిలియర్స్.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోన్న వీడియో
Ipl 2021, Rcb Skipper Virat Kohli And Ab De Villiers
Follow us on

IPL 2021: మైదానంలో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ ఏడుస్తూ కనిపించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయన సంగతి తెలిసిందే. అయితే తన కెప్టెన్సీలో చివరి ఐపీఎల్ ఆడుతోన్న ఆర్‌సీబీకి ట్రోఫీ అందించాలన్న విరాట్ కల మరోసారి నెరవేరకుండానే ముగిసిపోయింది. ఓటమితో, టోర్నమెంట్‌ నుంచి ఆర్‌సీబీ ప్రయాణం ముగిసింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది చివరి మ్యాచ్ కూడా. మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత జట్టుతో మాట్లాడుతున్నప్పుడు విరాట్ తీవ్రంగా ఏడుస్తూ కనిపించాడు. అతనితో పాటు డివిలియర్స్ కూడా ఏడుస్తూ వీడియోలో కనిపించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ చివరి ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో కోహ్లీ ఉద్వేగాన్ని ఆపులోకే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన తండ్రి మరణించే సమయంలోనూ ఏడవలేదు..
విరాటో కోహ్లీ తన తండ్రి మరణించిన సమయంలోనూ ఏడవలేదు. మరుసటి రోజు బ్యాటింగ్ చేయడానికి వెళ్లాడు. కోహ్లీ ఓసారి అమెరికన్ స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహం బెన్సింగర్‌తో ఇలా అన్నాడు, “నా తండ్రి చనిపోయే సమయంలో నేను 4 రోజుల మ్యాచ్ ఆడుతున్నాను. మరుసటి రోజు నేను బ్యాటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. నా తండ్రి తెల్లవారుజామున 2.30 గంటలకు మరణించాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరవుతున్నారు. కానీ, నా కళ్లలో నీళ్లు మాత్రం రాలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. నేను ఆశ్చర్యపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరుసటి రోజు విరాట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఈ టెస్టులో 90 పరుగులు చేశాడు. దీని తర్వాత, కోహ్లీ ఇలా ఏడుస్తూ కనిపించడం చాలా అరుదుగానే అని చెప్పుకోవచ్చు. 2016 ఐపీఎల్‌లో కోహ్లీ జట్టు ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు కూడా ఇలానే భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ సారి మాత్రం కెప్టెన్‌గా తన చివరి ఐపీఎల్, ఎలిమినేటర్ రౌండ్‌లో ఓడిపోయిన సమయంలో ఇలా ఏడుస్తూ కనిపించాడు.

Also Read: Virat Kohli: 9 ఏళ్ల నిరీక్షణ ఫలించలే.. ఆర్‌సీబీకి మరోసారి మొండిచేయి.. కోహ్లీ కెప్టెన్సీలో అందని ద్రాక్షగానే ఐపీఎల్ ట్రోఫీ..!

IPL 2021 Purple Cap: టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో కోహ్లీ ఫేవరేట్ ప్లేయర్