Watch Video: గాలిలోకి ఎగిరి మరీ ఒంటి చేత్తో క్యాచ్.. కానీ, చివరకు ఏం జరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

|

Jan 21, 2022 | 7:53 PM

Big Bash League: బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆస్ట్రేలియా ఆటగాడి ఫీల్డింగ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Watch Video: గాలిలోకి ఎగిరి మరీ ఒంటి చేత్తో క్యాచ్.. కానీ, చివరకు ఏం జరిగిందంటే? వైరలవుతోన్న వీడియో
Big Bash League Viral Video (1)
Follow us on

Big Bash League: జనవరి 21న ఆస్ట్రేలియా(Australia)లో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌(Big Bash League)లో ఫీల్డింగ్‌లో ఓ అద్బుతం జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విల్ పార్కర్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతున్న పార్కర్, బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షార్ట్‌ కొట్టిన బంతిని ఒంటిచేత్తో పట్టుకున్నాడు. అయితే ఈ సమయంలో అతని శరీరం బౌండరీని తాకింది. దాని కారణంగా ఆరు పరుగులు వచ్చాయి. అయితే విల్ పార్కర్ సూపర్ హీరోలా క్యాచ్ పట్టుకున్న యాక్షన్‌తో క్రికెట్ ప్రేమికులను విసరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

అడిలైడ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ నాలుగో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అలెక్స్ కారీ 57, మాథ్యూ షార్ట్ 57 పరుగులతో ఆడుతున్నారు. డార్సీ షార్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. నాల్గవ బంతి గూగ్లీ వేశాడు. దానిని మాథ్యూ లాంగ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. ఆ దిశగా నిలబడిన ఫీల్డర్ విల్ పార్కర్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. కానీ, బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడంతో జారిపడి బౌండరీ రోప్‌ను తాకాడు. ఈ సమయంలో బంతిని కూడా బయటకు విసిరాడు. కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఇలాంటి స్థితిలో ఓ అద్భుత క్యాచ్ పట్టినా బ్యాట్స్‌మెన్ ఖాతాలో ఆరు పరుగులు చేరాయి.

అడిలైడ్‌ ఇన్నింగ్స్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ ఆరు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ అత్యధికంగా 89 పరుగులు చేశాడు. అదే సమయంలో, అలెక్స్ కారీ 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షార్ట్ 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, క్యారీ-షార్ట్ భాగస్వామ్యానికి విరామం తర్వాత, మిగిలిన అడిలైడ్ బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.

ట్రావిస్ హెడ్ (5), ఇయాన్ కాక్‌బెయిన్ (3), మాట్ రెన్‌షా (7), జొనాథన్ వెల్స్ (12), థామస్ కెల్లీ (0) మాత్రమే పరుగులు చేయగలిగారు. ఒక దశలో అడిలైడ్ స్కోరు 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. కానీ, 20 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసింది. అంటే చివరి ఆరు ఓవర్లలో 43 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయారు. హోబర్ట్ బౌలర్లలో రిలే మెరెడిత్, టామ్ రోడ్జర్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read: IND vs SA, 2nd ODI: విరాట్ కోహ్లీ కెరీర్‌లో అరుదైన ఘనత.. ఈ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?

Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన పంత్.. డిఫరెంట్ డ్యాన్స్‌తో విష్ చేసిన కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..!