
Viral Video : భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ పార్ట్‌నర్‌షిప్‌ల్లో ఒకటైన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల కలయిక మళ్లీ జరిగింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రాంచీ చేరుకున్న కోహ్లీని, ధోని తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు. ఆ తర్వాత ధోని స్వయంగా తన ఎస్‌యూవీలో కోహ్లీని టీమ్ హోటల్‌కు దిగబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా, ధోని డ్రైవింగ్ సీట్‌లో, కోహ్లీ పక్కన కూర్చుని ప్రయాణించడం.. పాత జ్ఞాపకాలను, వారిద్దరి మధ్య అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. ఈ అద్భుతమైన రీ-యూనియన్ ఆఫ్ ది ఇయర్ వివరాలు తెలుసుకుందాం.
సౌతాఫ్రికాతో నవంబర్ 30న రాంచీలో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ బుధవారం లండన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. రాంచీ చేరుకున్న కోహ్లీ, యువ ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి, మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిశారు. నవంబర్ 27వ తేదీ రాత్రి ధోని తన రాంచీ ఫామ్‌హౌస్‌లో వీరిద్దరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు.
కోహ్లీ, ధోని నివాసంలోకి వెళ్తున్న దృశ్యాలను అభిమానులు గుర్తించడంతో ఈ సమావేశం గురించి మొదట బయటపడింది. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ హోటల్‌కు తిరిగి వెళ్లిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విందు తర్వాత, ఎంఎస్ ధోని స్వయంగా తన ఎస్‌యూవీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని, పక్కన కోహ్లీని కూర్చోబెట్టుకుని టీమ్ హోటల్‌కు డ్రాప్ చేశాడు. ఈ వీడియోలో ఎలాంటి సెక్యూరిటీ హంగామా గానీ, ఫ్లాషీ ఎస్కార్ట్ గానీ లేకపోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.
Mahi himself went to drop his Cheeku in the team hotel.🥹❤️ pic.twitter.com/ORLVKDJviw
— Virat Kohli Fan Club (@Trend_VKohli) November 27, 2025
పదేళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించిన ఈ ఇద్దరు దిగ్గజాల సుదీర్ఘ భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను రీ-యూనియన్ ఆఫ్ ది ఇయర్ అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. అభిమానులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వన్డే సిరీస్‌తో కోహ్లీ తిరిగి రాంచీలో మ్యాచ్ ఆడబోతున్నాడు. తన కుమారుడు అకాయ్ జననం కారణంగా ఫిబ్రవరి 2024లో రాంచీలో జరిగిన ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ను కోహ్లీ కోల్పోయాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై చివరిసారిగా అజేయంగా 74 పరుగులు చేసి జట్టు వైట్‌వాష్‌ను తప్పించాడు.
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా లేకపోవడంతో, కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వన్డేల్లో తిరుగులేని రికార్డు (14,255 పరుగులు,51 సెంచరీలు) ఉన్న కోహ్లీ ఈ సిరీస్‌లో మూడో స్థానంలో ఆడనున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఈ వన్డే సిరీస్‌లో బలంగా పుంజుకోవాలని చూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..