Vinod Kambli:అవును అతను నాకు వెన్నుపోటు పొడిచాడు అనుకున్న..! క్రికెట్ లెజెండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంబ్లీ

|

Dec 13, 2024 | 7:17 PM

వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్‌తో తన స్నేహంపై, 2009లో తలెత్తిన సంఘటనలపై తాజా వ్యాఖ్యలు చేశారు. 2013లో సచిన్ తన సర్జరీల ఖర్చును భరించడం తమ స్నేహం పునరుజ్జీవానికి కారణమని వెల్లడించారు. క్రికెట్ ప్రయాణంలో వచ్చిన ఒడిదుడుకులపై కూడా కాంబ్లీ మనసు విప్పారు.

Vinod Kambli:అవును అతను నాకు వెన్నుపోటు పొడిచాడు అనుకున్న..! క్రికెట్ లెజెండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంబ్లీ
Kambli Vs Sachin
Follow us on

2009లో సచిన్ టెండూల్కర్ తనకు సహాయం చేయలేదని ఆరోపించిన వినోద్ కాంబ్లీ ఇప్పుడు ఆ విషయంపై మరింత స్పష్టత ఇచ్చాడు. తన కాలంలో అత్యంత ప్రతిభావంతులైన భారత క్రికెటర్లలో ఒకరైన కాంబ్లీ, తాను ఆశించినంత శిఖరాలను అందుకోలేకపోయాడు. అతని కెరీర్ క్రమంగా దిగజారింది, తిరిగి పునరాగమనం చేయలేకపోయాడు. మరోవైపు, అతని స్నేహితుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాడిగా మన్ననలు అదుకున్నాడు.

రమాకాంత్ అచ్రేకర్ స్మారక సందర్భంగా సచిన్, కాంబ్లీ కలుసుకున్నప్పుడు, వారి వ్యక్తిగత జీవన స్థితుల మధ్య వ్యత్యాసం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు కాంబ్లీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కాంబ్లీ తన ఆరోగ్య సమస్యలపై పోరాడతానని, వాటిని అధిగమిస్తానని ధైర్యంగా ప్రకటించాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో, కాంబ్లీ తన స్నేహం గురించి, 2009లో తలెత్తిన సంఘటన గురించి మాట్లాడాడు. “ఆ సమయంలో, సచిన్ నాకు వెన్నుపోటు పొడిచాడని అనిపించింది. కానీ 2013లో నా రెండు సర్జరీలకు సచిన్ ఖర్చు చేసాడు. ఇది నా భావనను పూర్తిగా మార్చింది. మేము మాట్లాడుకున్నాము,  మా చిన్ననాటి స్నేహం మళ్లీ పునరుజ్జీవించింది,” అని కాంబ్లీ చెప్పాడు.

తన క్రికెట్ ప్రయాణం గురించి కూడా కాంబ్లీ ప్రస్తావించాడు. వాంఖడే మైదానంలో సాధించిన డబుల్ సెంచరీ తనకు ఎంతో ప్రీతిపాత్రమని, ఆ విజయాన్ని తన జీవితంలో చిరస్మరణీయ క్షణంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అచ్రేకర్ సార్ మద్దతు, జట్టు సహకారం, ముత్తయ్య మురళీధరన్ వంటి బౌలర్లతో జరిగిన సరదా సంగ్రామాలు అన్నీ తనకు చిరస్థాయిగా గుర్తుగా నిలిచాయన్నారు.

తన ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగలేకపోయిన, తన శక్తి అంతా పోయినా, తాను క్రికెట్‌కు న్యాయం చేయాలని ప్రయత్నించాను అని కాంబ్లీ పేర్కొన్నారు . తన కుటుంబానికి, సచిన్ వంటి స్నేహితుల మద్దతుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను అని కాంబ్లీ తుదిగా చెప్పాడు.