బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇండియా – ఇంగ్లండ్ ఐదో టెస్టు (India – England) మూడో రోజు ముగిసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జానీ బెయిర్‌స్టో (106) వద్ద ఔటయ్యాడు. బెయిర్ స్టోను ఔట్ చేసిన వెంటనే కోహ్లీ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెయిర్ స్టో (Bairstow) ను ఔట్ చేశాక కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంతకు ముందు విరాట్ కోహ్లీ, బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో అంపైర్లు కలగజేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. దంచికొడుతూ వేగంగా శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కాసేపటికే షమి బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కాడు. దీంతో కోహ్లీ క్యాచ్ అందుకున్న వెంటనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.
Kohli takes a sharp catch as Shami strikes on the first ball of a new spell to remove the danger man ??
ఇవి కూడా చదవండిWell played, Jonny Bairstow ??
Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) – (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/B0aOJ7u8Nc
— Sony Sports Network (@SonySportsNetwk) July 3, 2022
కాగా.. ఇంగ్లాండ్ – ఇండియా ఐదో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. తద్వారా భారత్ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా, పంత్ ఉన్నారు. కోహ్లీ(20), శుభ్‌మన్ గిల్(4), హనుమ విహారి(11) వద్ద ఔట్ అయ్యారు. కాగా అంతకు ముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. బెన్‌స్టోక్స్ వేసిన 29.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్ ఆ బంతిని అందుకోవడంతో కోహ్లి పెవిలీయన్ బాటపట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 45 ఓవర్లకు 125/3 గా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి