Video: గాయపడినా దూకుడు తగ్గలే.. 9 సిక్సులు, 6 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. 15 ఏళ్ల తర్వాత స్పెషల్ రికార్డ్..

వెంకటేష్ అయ్యర్ తుఫాన్ సెంచరీ ఆధారంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆతిథ్య ముంబై ఇండియన్స్‌కు 186 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది.

Video: గాయపడినా దూకుడు తగ్గలే.. 9 సిక్సులు, 6 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. 15 ఏళ్ల తర్వాత స్పెషల్ రికార్డ్..
Kkr Vs Mi Venkatesh Iyer

Updated on: Apr 16, 2023 | 5:38 PM

Venkatesh Iyer: మోకాలి గాయం, రన్నింగ్‌లో ఇబ్బంది.. గాయపడినా.. సింహంలా దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. బౌలర్లను చీల్చి చెండాడుతూ.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని సాధించాడు. కేకేఆర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేష్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వెంకటేష్ అయ్యర్ T20 కెరీర్‌లో ఇది మొదటి సెంచరీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కూడా అతను నిలిచాడు.

వాంఖడే స్టేడియంలో ముంబయిలో ఉక్కపోతతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. వెంకటేష్ అయ్యర్ చాలా ప్రశాంతంగా కనిపించినా.. దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లోనే మోకాలికి బలంగా తగలడంతో వెంకటేష్ అయ్యర్ తీవ్ర వేదనకు గురయ్యాడు. అతను మైదానంలో పడిపోయాడు. జట్టు ఫిజియో అతన్ని మళ్లీ ఆడేందుకు సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. బాధతో మూలుగుతూనే వెంకటేష్ మళ్లీ ఆడేందుకు లేచాడు.

ఇవి కూడా చదవండి

ఈ బాధాకరమైన గాయంతో పోరాడుతున్న వెంకటేష్ మరింత ప్రమాదకరంగా మారాడు. అతను పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ, అతను గట్టిగా నిలబడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో, అతను ఫోర్లు, సిక్సర్లతో తన జట్టు స్కోర్‌బోర్డ్‌ను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత కూడా ధాటిగా ఆడాడు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్భుత అవకాశం 17వ ఓవర్లో అవకాశం వచ్చింది. డువాన్ జాన్సన్ వేసిన బంతికి వెంకటేష్ సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ సెంచరీ పూర్తి చేశాడు.

రెండు మ్యాచ్‌ల క్రితం కూడా, వెంకటేష్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అయితే అతను గుజరాత్ టైటాన్స్‌పై 83 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, ఈ సెంచరీ అతనికి ప్రత్యేకమైనది. ఎందుకంటే 85 మ్యాచ్‌ల T20 కెరీర్‌లో ఇది అతని మొదటి సెంచరీ. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం రెండు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో తొలి సెంచరీ సాధించాడు.

వెంకటేష్ మాత్రమే కాదు.. కేకేఆర్ అభిమానులు కూడా దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెంచరీ వారికి కూడా ప్రత్యేకమైనది. 2021లో కేకేఆర్ నుంచి ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వెంకటేష్ 15 ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2008లో అతని కంటే ముందు, బ్రెండన్ మెకల్లమ్ మొదటి సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అంటే వెంకటేష్ ఈ నిరీక్షణను ముగించడమే కాకుండా మెకల్లమ్ రికార్డును బద్దలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..