Vaibhav Suryavanshi : టాస్ ఓడితేనే ఇంతలా కొట్టావా సామీ? గెలిచి ఉంటే సౌతాఫ్రికా బౌలర్లు రిటైర్మెంట్ ప్రకటించేవారేమో

Vaibhav Suryavanshi : రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన వైభవ్ సూర్యవంశీ, టాస్ ఓడిపోవడంతో కెమెరా ముందు ముఖం చాటేసుకుని తెగ ఫీలైపోయాడు. ఒక 14 ఏళ్ల పిల్లాడిలా అతను చూపించిన ఆ అమాయకపు రియాక్షన్ చూసి మ్యాచ్ రిఫరీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

Vaibhav Suryavanshi : టాస్ ఓడితేనే ఇంతలా కొట్టావా సామీ? గెలిచి ఉంటే సౌతాఫ్రికా బౌలర్లు రిటైర్మెంట్ ప్రకటించేవారేమో
Vaibhav Suryavanshi

Updated on: Jan 08, 2026 | 4:59 PM

Vaibhav Suryavanshi : సౌతాఫ్రికా గడ్డపై భారత అండర్-19 జట్టు విజయభేరి మోగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు ప్రొటీస్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల విధ్వంసం, బౌలర్ల పదునైన దాడి ముందు సౌతాఫ్రికా తలవంచక తప్పలేదు. దీంతో భారత్ 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని ముద్దాడింది.

ఈ మ్యాచ్ ప్రారంభంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన వైభవ్ సూర్యవంశీ, టాస్ ఓడిపోవడంతో కెమెరా ముందు ముఖం చాటేసుకుని తెగ ఫీలైపోయాడు. ఒక 14 ఏళ్ల పిల్లాడిలా అతను చూపించిన ఆ అమాయకపు రియాక్షన్ చూసి మ్యాచ్ రిఫరీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే టాస్ ఓడిపోయిన ఆ కోపాన్ని వైభవ్ తన బ్యాటింగ్‌పై చూపించాడు.

సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోవడం ఎంత పెద్ద తప్పో వైభవ్ తన బ్యాటింగ్‌తో నిరూపించాడు. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీని ద్వారా యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో (14 ఏళ్ల 9 నెలలు) సెంచరీ చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తం 127 పరుగులు (74 బంతుల్లో) చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల సునామీ కురిసింది. అతనికి తోడుగా ఆరోన్ జార్జ్ (118) కూడా సెంచరీతో మెరవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 393/7 భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 227 పరుగులు జోడించడం విశేషం.

394 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే కిషన్ సింగ్ చుక్కలు చూపించాడు. కేవలం 15 పరుగులకే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. డానియల్ బోస్మాన్, జేసన్ రోల్స్ కొద్దిసేపు పోరాడినా, భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 160 పరుగులకే ఆలౌట్ కావడంతో, భారత్ 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, భవిష్యత్ స్టార్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.