
Vaibhav Suryavanshi in U19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు దూసుకెళ్తోంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఫ్యాన్స్ కు అసలైన్ ట్రీట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్‌లో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో నంబర్ 1 బ్యాటర్ నిలిచే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ యంగ్ ప్లేయర్ నంబర్ 1 అవ్వడమే కాకుండా, పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజామ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలంటే భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంచరీ కూడా వస్తుందన్నమాట. ఇలా చేస్తే బాబర్ ఆజం రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 ఆల్-టైమ్ లీడింగ్ రన్-స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది.
అండర్-19 వన్డేల్లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో, బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్ 37 మ్యాచ్‌ల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో 1,261 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ బంగ్లా ప్లేయర్ సగటు 42.03, స్ట్రైక్ రేట్ 74.79గా ఉంది. ఆ తర్వాత 23 మ్యాచ్‌ల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో 1,169 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ రెండవ స్థానంలో నిలిచాడు. వైభవ్ సగటు 50.82, స్ట్రైక్ రేట్ 158.18గా ఉంది. ఇది అండర్-19 వన్డే హిస్టరీలో ఏ బ్యాట్స్‌మన్‌కైనా అత్యధికం కావడం విశేషం.
బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. దీంతో వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలలో నంబర్ 1 యాక్టివ్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్‌ను అధిగమించి నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. ఇందుకోసం సెమీ-ఫైనల్‌లో వైభవ్ 93 పరుగులు చేయాల్సి ఉంటుంది.
వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాదు.. బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టగలడు. బాబర్ అజామ్ 36 అండర్-19 వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో 1271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ కాలంలో, సగటు 38.51, స్ట్రైక్ రేట్ 73.85గా ఉంది. అంటే పరుగుల పరంగా బాబర్ అజామ్‌ను అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీకి 103 పరుగులు అవసరం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..