Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

Vaibhav Sooryavanshi Jersey in Duleep Trophy 2026: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో వింతగా కనిపించాడు. తన జెర్సీ నంబర్‌పై టేప్ వేసుకుని బరిలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ 15 ఏళ్ల లెఫ్ట్‌హ్యాండర్ చేసిన పని వెనుక బలమైన సెంటిమెంట్ దాగుంది.

Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
Vaibhav Sooryavanshi Jersey In Duleep Trophy

Updated on: Aug 24, 2026 | 3:29 PM

Vaibhav Sooryavanshi Jersey in Duleep Trophy 2026: భారత దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈస్ట్ జోన్ తరపున వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో అడుగుపెట్టగానే ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. అతడు ధరించిన జెర్సీ వెనుక భాగంలో ఒక నంబర్‌ను ప్లాస్టర్‌తో కప్పి ఉంచడం స్పష్టంగా కనిపించింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ దూకుడుగా ఆడే క్రమంలో 8 (6) పరుగులకే బిశ్వోర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే అవుటైన తర్వాత అతడి జెర్సీపై ఉన్న టేప్ వ్యవహారమే ప్రధాన చర్చగా మారింది.

జెర్సీపై టేప్ ఎందుకు వేశాడు..?

ఈస్ట్ జోన్ లాజిస్టిక్స్ విభాగం వైభవ్‌కు కావాల్సిన ప్రత్యేక నంబర్ జెర్సీని సకాలంలో అందించలేకపోయింది. దీంతో వేరే నంబర్ ఉన్న జెర్సీని తీసుకున్న వైభవ్, తనకు కావలసిన నంబర్ 3 మాత్రమే కనిపించేలా మిగిలిన భాగాన్ని టేప్‌తో అతికించేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినా, భారత్ తరపున అరంగేట్రం చేసినా అతడు ఎప్పుడూ 3వ నంబర్ జెర్సీతోనే ఆడుతుంటాడు. ఆ సెంటిమెంట్‌ను మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఉపాయం ఆలోచించాడు.

నంబర్ 3 వెనుక తల్లి ఇచ్చిన సలహా..

వైభవ్ 3వ నంబర్‌ను ఎంచుకోవడం వెనుక ఒక ఆసక్తికర న్యూమరాలజీ కథ ఉంది. అండర్-19 ఆసియా కప్ 2025 సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో స్వయంగా వెల్లడించాడు. 12వ నంబర్ తీసుకునే బదులు, ఒకటి రెండు కలిపితే 3 అవుతుంది కాబట్టి నేరుగా 3వ నంబర్‌నే తీసుకోవాలని ఆమె సూచించింది. ఆ నంబర్ వచ్చాక ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు ఇంగ్లండ్‌పై జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం కూడా దక్కింది.

మొదటి ఇన్నింగ్స్‌లో లక్ కలిసిరాక తక్కువ పరుగులకే అవుటైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించే సత్తా వైభవ్‌కు ఉంది. ఈ యువ సంచలనం తన లక్కీ జెర్సీతో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us