వామ్మో.. ఆకాశాన్ని తాకుతోన్న బుడ్డోడి బ్రాండ్ వాల్యూ.. ఐపీఎల్ తర్వాత డబుల్ పెంచేశాడుగా.. ఎంతో తెలుసా?

Vaibhav Sooryavanshi Brand Endorsement Fee: చిన్న వయసులోనే అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన వైభవ్ సూర్యవంశీ, భారత క్రికెట్ భవిష్యత్తుకు సరికొత్త ఆశాకిరణంగా మారాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ, వెలుపల బ్రాండ్ మార్కెట్‌ను శాసిస్తున్న ఈ 15 ఏళ్ల బాల సంచలనం రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

వామ్మో.. ఆకాశాన్ని తాకుతోన్న బుడ్డోడి బ్రాండ్ వాల్యూ.. ఐపీఎల్ తర్వాత డబుల్ పెంచేశాడుగా.. ఎంతో తెలుసా?
Vaibhav Suryavanshi Records

Updated on: Jun 02, 2026 | 4:01 PM

Vaibhav Sooryavanshi Brand Endorsement Fee: ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. మైదానంలో అతడు సృష్టించిన సునామీతో కేవలం టీమిండియా సెలక్షన్ రేసులోనే కాదు, వ్యాపార ప్రకటనల ప్రపంచంలోనూ ఈ రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం బ్రాండ్ విలువ రాత్రికి రాత్రే రెట్టింపు అయింది.

ఆరెంజ్ క్యాప్ విజేత.. పరుగుల రారాజు!

ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచినప్పటికీ, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే. 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 కి పైగా పరుగులు సాధించి, కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం బెంబేలెత్తించిన ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ప్రదర్శన చూసి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో పోలుస్తున్నారు.

కోటి నుంచి రెండు కోట్లకు చేరిన బ్రాండ్ విలువ..

మైదానంలో వైభవ్ సృష్టించిన ఈ వండర్ విజువల్స్ అతడి కమర్షియల్ మార్కెట్‌ను ఒక్కసారిగా మార్చేసాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వరకు ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం సుమారు కోటి రూపాయల వరకు తీసుకున్న వైభవ్, ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలకు పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో 1.10 కోట్ల వార్షిక ఒప్పందంలో ఉన్న ఈ యువ ఆటగాడి ఐపీఎల్ వేతనం మారడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం అప్పుడే ఆకాశాన్ని తాకుతోంది.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పోర్ట్‌ఫోలియోను అతడి తల్లిదండ్రులతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సంయుక్తంగా పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లయిన కాంప్లాన్, రెడ్ బుల్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న వైభవ్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరికొన్ని అగ్రశ్రేణి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐపీఎల్‌లో అతడి మెరుపులు చూసిన ప్రకటనల సంస్థలు, ఎంత ధరైనా సరే వైభవ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడానికి పోటీ పడుతున్నాయి.

త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ? బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!

మరోవైపు, వైభవ్ సూర్యవంశీని అత్యంత వేగంగా భారత సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి బీసీసీఐ సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ వండర్ కిడ్ ప్రదర్శనను చాలా నిశితంగా గమనించింది. రాబోయే బ్రిటన్ (UK) పర్యటన కోసం జరగబోయే ఎంపిక కమిటీ సమావేశంలో వైభవ్ సెలక్షన్ పై అధికారిక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దేశం తరఫున ఆడేందుకు ఈ యువ సంచలనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us