AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తన 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్ పోటీల్లో హాఫ్ సెంచరీ బాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అత్యంత చిన్న వయసులోనే ఈ లీగ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర పుటలకెక్కాడు. క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ తన అద్భుతమైన టాలెంట్‌ను చాటుకున్నాడు.

Vaibhav Sooryavanshi: క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు
Vaibhav Sooryavanshi (1)
Rakesh
|

Updated on: Aug 31, 2026 | 2:54 PM

Share

Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆశ్చర్యపరిచే మైలురాళ్లను అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు, రాబోయే రోజుల్లో ఎవరూ బ్రేక్ చేయలేని 7 సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధ్వంసకర రికార్డుల వివరాలేంటో తెలుసుకుందాం.

1. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన హాఫ్ సెంచరీ వీరుడు

వైభవ్ సూర్యవంశీ తన 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్ పోటీల్లో హాఫ్ సెంచరీ బాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అత్యంత చిన్న వయసులోనే ఈ లీగ్‌లో అర్ధసెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర పుటలకెక్కాడు. క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ తన అద్భుతమైన టాలెంట్‌ను చాటుకున్నాడు.

2. ఐపీఎల్ లో అతి పిన్న వయస్కుడైన సెంచరీ రికార్డు

హాఫ్ సెంచరీతో ఆగకుండా అదే ఇన్నింగ్స్‌ను వైభవ్ మూడు అంకెల స్కోరుగా మలిచాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో పురుషుల టి20 క్రికెట్ చరిత్రలోనే అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన దిగ్గజ బ్యాటర్ల సరసన చోటు సంపాదించుకున్నాడు.

3. ఇండియన్ బ్యాటర్ల పరంగా అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ

వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది నమోదైంది. ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో మెరుపు వేగంతో విరుచుకుపడటం క్రికెట్ దిగ్గజాలను సైతం విస్మయానికి గురిచేసింది.

4. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ రికార్డు

కేవలం టీ20ల్లోనే కాకుండా లిస్ట్-ఎ (వన్డే) ఫార్మాట్‌లో కూడా వైభవ్ తన సత్తా చాటాడు. తన 14 ఏళ్ల 272 రోజుల వయసులోనే లిస్ట్-ఎ క్రికెట్‌లో సెంచరీ సాధించి, ఈ ఫార్మాట్‌లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడైన పురుషుల బ్యాటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాడు.

5. టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన రికార్డు

క్రీజులో ఉంటే సిక్సర్ల వర్షం కురిపించడం వైభవ్‌కు వెన్నతో పెట్టిన విద్య. టీ20 క్రికెట్‌లో కేవలం 514 బంతులను ఎదుర్కొని 100 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత సాధించాడు. అత్యంత తక్కువ బంతుల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడం ఇతని పవర్ హిట్టింగ్‌కు నిదర్శనంగా నిలిచింది.

6. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల కొత్త రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన ధనాధన్ బ్యాటింగ్‌తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఒక్క సీజన్‌లోనే ఏకంగా 72 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న విధ్వంసకర రికార్డును చెరిపేసి అగ్రస్థానంలో నిలిచాడు.

7. దులీప్ ట్రోఫీలో 57 ఏళ్ల రికార్డు బ్రేక్

ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో 15 ఏళ్ల 157 రోజుల వయసులో వైభవ్ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 1969లో లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉన్న 57 ఏళ్ల నాటి పాత రికార్డును బ్రేక్ చేసి, దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల