WI vs SA: కార్ట్ వీల్ తో అలరించిన యూనివర్సల్ బాస్..! వైరలవుతోన్న వీడియో

|

Jul 02, 2021 | 12:59 PM

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మ్యాచ్ లో చేసే సందడి మాములుగా ఉండదు.  ఆనందంలో ఉన్నప్పుడు వింత వింత స్టెప్పులతో డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటాడు.

WI vs SA: కార్ట్ వీల్ తో అలరించిన యూనివర్సల్ బాస్..! వైరలవుతోన్న వీడియో
Chris Gale Cartwheel
Follow us on

WI vs SA: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మ్యాచ్ లో చేసే సందడి మాములుగా ఉండదు.  ఆనందంలో ఉన్నప్పుడు వింత వింత స్టెప్పులతో డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటాడు. అయితే, తన కెరీర్ లో చివరి దశలో ఉన్న ఈ వెస్టిండీస్ పరుగులు సునామీ.. మైదానంలో వయసుకు మించి డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటాడు. పొట్టి క్రికెట్ లో సునామీలా పరుగులు సాధించి, బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు ఈ 41 ఏళ్ల ఆల్ రౌండర్. తాజాగా దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ టీ20 సిరీస్ జరుగుతోంది. అయితే, నాలుగో టీ20 సందర్భంగా చేసిన ఓ డ్యాన్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెన్డ్రిక్స్‌ ఔటయ్యాక  గయానా ఆటగాడు కెవిన్ సింక్లైర్ ని ఇమేటేట్ చేస్తూ చిందులు చేశాడు.

గేల్ తన తొలి ఓవర్ డెలివరీతోనే దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్డ్రిక్స్ (2) వికెట్ పడగొట్టాడు. దీంతో ట్విట్టర్లోనూ గేల్ సునామీ మొదలైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లతో కేవలం 146/9 కే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-2తో సమం చేసింది. భుజం గాయంతో హార్డ హిట్టర్ ఫాబియన్ అలెన్‌ ఈ మ్యాచ్లో ఆడలేదు. అయినా వెస్టిండీస్ జట్టు 167/6 పరుగులు చేసింది.

డ్వేన్ బ్రావో నాలుగు వికెట్లతో రాణించి, దక్షిణాఫ్రికా టీం ను దెబ్బతీశాడు. అలాగే కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ఒక వికెట్ తీసి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేశాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్ టీం విజయం సాధించింది. గేల్ కూడా రెండు క్యాచ్ లతోపాటు ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో పొలార్డ్ ఐదు సిక్సర్లతో 24 బంతుల్లో హాప్ సెంచరీ కొట్టాడు. దీంతో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు.


Also Read:

Virushka Viral Photos: క్రికెటర్ పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్..! వైరలవుతోన్న ఆనాటి ఫొటోలు

IND vs ENG: గాయంతో టీమిండియా ఓపెనర్ ఔట్..! ఈ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికో..?

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ