తొలి వన్డేలో అమెరికా ఘన విజయం.. కేవలం 28 ఓవర్లలోనే ఫలితం.. ఈ భారత స్పిన్నరే కారణం.. ఆయనెవరో తెలుసా?

|

Sep 07, 2021 | 9:57 AM

USA Cricket: ఇతర దేశాల ఆటగాళ్ల రాకతో అమెరికా క్రికెట్ టీం బలం పెంచుకుంటోంది. తాజాగా సాధించిన ఈ విజయమే అందుకు చక్కని ఉదాహరణ.

తొలి వన్డేలో అమెరికా ఘన విజయం.. కేవలం 28 ఓవర్లలోనే ఫలితం.. ఈ భారత స్పిన్నరే కారణం.. ఆయనెవరో తెలుసా?
Usa Cricket Team
Follow us on

USA Cricket: అమెరికా క్రికెట్ ఉపాయాలు నేర్చుకునే పనిలో పడింది. మ్యాచ్‌లను గెలిచే కళను అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇతర దేశాల ఆటగాళ్ల రాకతో అమెరికా టీం బలం పెరుగుతోంది. తాజాగా పాపువా న్యూ గినియా వంటి జట్టుతో తలపడి అద్భుత విజయాన్ని అందుకుంది. 50 ఓవర్లు కూడా ఆడకుండానే ప్రత్యర్థి జట్టును పెవిలియన్ పంపి ఆటను ముగించింది. పాపువా న్యూ గినియా జట్టు కేవలం 28.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.

అమెరికా సాధించిన ఈ విజయానికి భారత్‌కు కూడా సంబంధం ఉంది. పాపువా న్యూ గినియా బ్యాట్స్‌మెన్లను తన స్పిన్నర్‌తో ముప్పతిప్పలు పెట్టిన స్పిన్నర్ అహ్మదాబాది అని తేలింది. ఇటీవలి కాలంలో చాలా మంది క్రికెటర్లు అమెరికా తరపున క్రికెట్ ఆడటానికి తమ దేశాలు విడిచి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. అయితే, పాపువా న్యూ గినియాపై గెలుపులో మెరిసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నిసర్గ్ పటేల్ భారతదేశానికి చెందిన వాడే కావడం విశేషం.

అమెరికా విజయానికి అహ్మదాబాద్ కనెక్షన్..
పాపువా న్యూ గినియా జట్టు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది. నిసర్గ్ పటేల్ స్పిన్ బౌలింగ్‌తో మ్యాచును మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో నిసర్గ్ పటేల్ 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా 44.2 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. ఆ టీం కెప్టెన్ అసద్ వాలా(61) మాత్రమే అత్యధిక పరుగులతో నిలిచాడు.

28.2 ఓవర్లలోనే అమెరికా విజయం
అమెరికా విజయం సాధించేందుకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే అమెరికా జట్టు కేవలం 28.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్‌ను సాధించింది. అమెరికా తరఫున ఓపెనర్ స్టీవెన్ టేలర్ 55 బంతుల్లో అత్యధికంగా 82 పరుగులు బాదేశాడు. టేలర్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అలాగే వికెట్ కీపర్ కం బ్యాట్స్ మన్ మోనక్ పటేల్ 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 82 పరుగుల ఇన్నింగ్స్‌లో స్టీవెన్ టేలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

పాపువా న్యూ గినియాతో జరిగిన 2వ వన్డే సిరీస్‌లో అమెరికా గెలిచిన మొదటి మ్యాచ్ ఇది. తదుపరి వన్డేలో కూడా గెలిచి ట్రోఫీని క్లీన్ స్వీప్ చేయాలని అమెరికా భావిస్తోంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 9 న జరగనుంది.

Also Read: Virat Kohli-Ashwin: అశ్విన్‌ను అందుకే పక్కన పెట్టాం..! అసలు విషయం చెప్పిన టీమిండియా కెప్టెన్

ND vs ENG: ఓవల్ టెస్టులో నిజమైన హీరో నేను కాదు..! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ టీంలో ఈ 14 మంది ఆటగాళ్లు ఫిక్స్..? మిగతా స్థానాల కోసం తీవ్రమైన పోటీ