Virat Kohli, PBKS vs RCB: మొహాలి వేదికగా జరుగుతున్న నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో అటు క్రికెట్ అభిమానులకు, ఇటు కోహ్లీ అభిమానులకు అనూహ్యమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అవును, విరాట్ కోహ్లిని మరోసారి కెప్టెన్‌గా చూసే అవకాశం అభిమానులకు దక్కింది. పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న ఆర్‌సీబీని ఈ రోజు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీనే అంటిపెట్టుకుని ఉన్న కోహ్లీ.. ఆ టీమ్‌కి 2013 నుంచి 2021 వరకు సారథిగా ఉన్నాడు. అయితే అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నకోహ్లీ మళ్లీ ఈ రోజు కెప్టెన్‌గా మరోసారి ఆడుతున్నాడు. అంటే 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత మళ్లీ తొలిసారిగా కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు.
ఈ రోజు మ్యాచ్ సందర్భంగా తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్‌సీబీ ఆడిన గత మ్యాచ్‌లో ఆ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ గాయపడ్డాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ని కెప్టెన్ నడిపిస్తున్నాడు. టాస్ టైమ్‌లో కోహ్లీ మాట్లాడుతూ ‘ఫాఫ్ ఈరోజు ఫీల్డింగ్ చేయడం లేదు. అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వైశాఖ్ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. మేము కూడా మొదటగానే బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా.. అదే అవకాశం వచ్చింది. ఇది తప్ప టీమ్‌లో ఎలాంటి మార్పులు లేవ’ని తెలిపాడు.
BREAKING: Toss with a twist! King Kohli to lead RCB today as @faf1307 is nursing an injury he picked up in the last match.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #PBKSvRCB @imVkohli pic.twitter.com/vCVhJPhlhk
— Royal Challengers Bangalore (@RCBTweets) April 20, 2023
కాగా, ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా దిగిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్ టీమ్‌కి అద్భుతమైన శుభారంభాన్నిఅందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని ఇవ్వడంతో పాటు అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే హర్‌ప్రీత్‌బ్రార్ వేసిన 17 ఓవర్ తొలి బంతిని ఆడిన కోహ్లీ(59 పరుగులు) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..