విరాట్‌తో పోల్చి ఆకాశానికెత్తారు.. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే? (వీడియో)

|

Oct 05, 2021 | 1:52 PM

స్వదేశంలో విఫలమైన ఈ క్రికెటర్.. అమెరికాలో ఆడేందుకు వెళ్లాడు. వికెట్‌ను అర్థం చేసుకునేలోపే మొదటి ఓవర్ తొలి బంతికే బౌలర్ తన వికెట్‌ను పడగొట్టాడు.

విరాట్‌తో పోల్చి ఆకాశానికెత్తారు.. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే? (వీడియో)
Pakistan Cricketer Umar Akmal
Follow us on

ఉమర్ అక్మల్ ప్రస్తుతానికి పాకిస్తాన్ దేశాన్ని వదిలి అమెరికా వైపు వెళ్లాడు. అక్కడ అతను ఉత్తర కాలిఫోర్నియా క్రికెట్ అసోసియేషన్‌తో చేతులు కలిపాడు. ఆటీంతో స్వల్పకాలిక ఒప్పందంపై సంతకం చేశాడు. అతను ప్రస్తుతం కాలిఫోర్నియా జల్మి జట్టు తరపున ప్రీమియర్ సి లీగ్‌లో ఆడుతున్నాడు. కానీ, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అతని ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. 4 మ్యాచ్‌ల తరువాత, అతని ప్రదర్శన ఓసారి పరిశీలిస్తే అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి ఆటగాడినే ఒకప్పుడు విరాట్ కోహ్లీతో పోల్చారు. కోహ్లీ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటాడని ఆకానికి ఎత్తేశారు. అలా పోల్చడం సరికాదని త్వరలోనే తెల్సుకున్నారు. ఎందుకంటే తరువాత అన్ని మ్యాచుల్లో పరుగులు చేయకుండానే వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఉమర్ అక్మల్ బ్యాట్‌ నుంచి స్వదేశంలోనూ పరుగులు రాలేదు. అలాగే ప్రస్తుతం విదేశంలోనూ అలాంటి ఫాంనే ప్రదర్శిస్తున్నాడు.

ప్రీమియర్ సి లీగ్‌లో ఉమర్ అక్మల్ తన జట్టు కాలిఫోర్నియా జల్మీ కోసం ఆడిన చివరి మ్యాచ్‌లో క్రీజులో నిలవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. అలా క్రీజులోకి వచ్చి అమెరికన్ వికెట్‌ను అర్థం చేసుకునే లోపే బౌలర్ తన వికెట్‌ను పడగొట్టాడు. ఉమర్ అక్మల్ తన ఇన్నింగ్స్ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఖాతా తెరవడం కూడా అతనికి కష్టంగా మారింది.

ఉమర్ అక్మల్ జట్టు మొత్తం 65 పరుగులకే ఆలౌట్..
కాలిఫోర్నియా జల్మి చివరి మ్యాచ్ సహారా ఆల్ స్టార్స్ మధ్య జరిగింది. తొలుత ఆడిన సహారా జట్టు 117 పరుగులకు ఆలౌట్ అయింది. 50 ఓవర్ల ఆటలో ఈ లక్ష్యం చాలా చిన్నది. కానీ, కాలిఫోర్నియా జల్మి జట్టు కేవలం 19 వ ఓవర్‌లోనే ఆలౌట్ అయింది. మొత్తం జట్టు కలిసి 65 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో సహారా ఆల్‌స్టార్ ఈ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. సహారా ఆల్‌స్టార్‌కు చెందిన ముగ్గురు బౌలర్లే కాలిఫోర్నియా జల్మి మొత్తం వికెట్లు పడగొట్టారు.

4 మ్యాచ్‌ల్లో 20 పరుగులు..
అమెరికా చేరిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ ఉమర్ అక్మల్ పేలవ ప్రదర్శన మరలా మొదలైంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. 4 మ్యాచ్‌లలో 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతను కేవలం ఒక మ్యాచ్‌లో 17 పరుగులు చేశాడు. మిగిలిన 3 పరుగులను మూడు మ్యాచుల్లో చేశాడు. మూడు పరుగులు చేసేందుకు మూడు సార్లు ఔటయ్యాడు. ఈ 4 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు T10 ఫార్మాట్‌లో ఆడాడు.

Also Read: IPL 2021 DC vs CSK: ఈ లోపాలతోనే ధోని సేన ఓడింది.. అలా జరగకుంటే మ్యాచ్ మరోలా ఉండేది..!

క్రికెట్ టీంపై దొంగల దాడి.. డబ్బుతోపాటు వాటిని కూడా తీసుకెళ్లారంటూ కీపర్ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

Shimron Hetmyer: మ్యాచ్ గెలిపించానోచ్.. బ్రావో భుజాలపైకి ఎక్కి సంతోషాన్ని పంచుకున్న హెట్‌మేయిర్.. వైరలవుతోన్న వీడియో