U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. స్కాట్లాండ్ వంటి బలహీనమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇది సులువుగా జ

U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..
U19 World Cup

Updated on: Jan 15, 2022 | 10:58 AM

U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. స్కాట్లాండ్ వంటి బలహీనమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇది సులువుగా జరిగిపోయింది. స్కాట్లాండ్ టోర్నమెంట్ కోసం అర్హత కూడా సాధించలేదు. కానీ న్యూజిలాండ్ ఉపసంహరించుకోవడంతో అండర్-19 ప్రపంచకప్ ఆడేందుకు అవకాశం దక్కింది. టోర్నమెంట్‌లో గ్రూప్ Dలో చేరిన స్కాట్లాండ్ శ్రీలంకతో మొదటి మ్యాచ్ ఆడింది. ఇందులో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్కాట్లాండ్‌పై శ్రీలంక సునాయన విజయం సాధించింది.

శ్రీలంక కెప్టెన్ దునిత్ వెలాజ్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. 9 ఓవర్లలో 3 ఎకానమీ వద్ద 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంటే స్కాట్లాండ్ జట్టులో సగం మందిని కేవలం 27 పరుగులకే కట్టడి చేయడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 45.2 ఓవర్లలో జట్టు 218 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక అత్యధిక పరుగు, ఏకైక అర్ధ సెంచరీ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సకున నిదర్శన్ 85 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆడాడు.219 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్‌కు 48.4 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. శ్రీలంక కెప్టెన్ దునిత్ వెలాజ్ బ్యాట్‌తో ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ బంతితి మ్యాజిక్‌ చేశాడు.

27 పరుగులకే 5 వికెట్లు తీశాడు ఇందులో టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు వికెట్లు ఉన్నాయి. శ్రీలంక కెప్టెన్‌తో పాటు మిగతా బౌలర్లు కూడా తమకు తాముగా వికెట్లు పంచుకున్నారు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు శ్రీలంక కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే విజయ వీరుడిగా నిలిచిన తర్వాత కెప్టెన్‌లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఇది జట్టుకు మనోధైర్యాన్ని అందించగలదు.

Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..

ఈ ప్రభుత్వ పథకంలో డబ్బు సులువుగా రెట్టింపు.. అంతేకాదు సురక్షితం కూడా..?

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?