అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 11 ) భారత యువ జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. భారత్‌కి ఇది 9వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. 5 సార్లు టైటిల్ నెగ్గిన భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ టైటిల్ ను కైవసం చేసుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగుతోంది. అలాగే, నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా జూనియర్ జట్టుకు లభించింది. భారతదేశ U-19 జట్టు 2016 నుండి అన్ని ఫైనల్స్ ఆడింది, 2016, 2020లో ఓడిపోయింది. 2018, 2022 ఎడిషన్‌లలో టైటిల్స్ గెలుచుకుంది. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్‌కు విశేష ఆదరణ లభించింది. లైవ్ టీవీ కవరేజ్, ‘స్ట్రీమింగ్’ కారణంగా ఈ మెగా టోర్నీపై ఆసక్తి కూడా పెరిగింది. అండర్-19 ప్రపంచకప్‌లో రాణంచి జాతీయ జట్టులో చోటు దక్కించిన వారిలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11 ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రపంచకప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఈ 6 మ్యాచ్‌లు ఆడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏక పక్ష విజయాలు సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన ఉదయ్ సహారన్ జట్టు ఫైనల్ లోనూ ఘన విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Final Ready 🙌
The two captains are all set for the #U19WorldCup Final 👌👌#TeamIndia | #BoysInBlue | #INDvAUS pic.twitter.com/9I4rsYdRGZ
— BCCI (@BCCI) February 10, 2024
𝗢𝗻𝗲 𝗦𝘁𝗲𝗽 𝗔𝘄𝗮𝘆! 👏 👏
Check out the #BoysInBlue‘s Road to the Final after an unbeaten run in the #U19WorldCup 🙌 🙌#TeamIndia | #INDvAUS pic.twitter.com/VFSoeWh4PL
— BCCI (@BCCI) February 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..