U19 Asia Cup: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్..

|

Dec 25, 2021 | 8:05 PM

శనివారం దుబాయ్‌లో జరిగిన under-19 ఆసియా కప్ మ్యాచ్‎లో ఇండియాపై పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది...

U19 Asia Cup: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్..
Under-19
Follow us on

శనివారం దుబాయ్‌లో జరిగిన under-19 ఆసియా కప్ మ్యాచ్‎లో ఇండియాపై పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ ఆటగాడు ముహమ్మద్ షెహజాద్ 81 పరుగులు చేయడంతో పాక్ గెలుపొందింది. భారత్ సోమవారం ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుండగా, అదే రోజు పాకిస్తాన్ UAEతో తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరాధ్య యాదవ్ 50 పరుగులు, హర్నూర్ సింగ్ 46, కౌశల్ తాంబే 32 పరుగులతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో జీషన్ జమీర్ 5 వికెట్ల పడగొట్టి ఇండియాను దెబ్బ తీశాడు. భారత కెప్టెన్ యశ్ ధుల్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.

238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలో దెబ్బ తీశాడు రాజ్‌వర్ధన్ హంగాగ్రేకర్. ఓపెనర్ అబ్దుల్ వాహిద్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మాజ్ సదాకత్, ముహమ్మద్ షెహజాద్ రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని15వ ఓవర్‌లో రషీద్ రాజ్ బావా బ్రేక్ చేశాడు.

ఆ తర్వాత పాకిస్తాన్ వికెట్లు కోల్పోతూనే ఉంది. షెహజాద్ పాక్‎ను ఆదుకున్నాడు. షెహజాద్‌ను రనౌట్ చేయడం ద్వారా ఇండియా ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి 8 పరుగులు అవసరం అయ్యాయి. చివరి బంతికి పాకిస్తాన్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా అహ్మద్ ఖాన్ బౌండరీ కొట్టి తన జట్టును గెలిపించాడు. భారత్ తరఫున రాజా బావా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Read Also.. IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..