Mohammed Shami: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‌తో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పేసర్ మహ్మద్ షమీని ఆన్‌లైన్‌లో లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం 3.5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో షమీకి అస్సలు మంచిరోజు కాదు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు మెదపలేదు. షమీ తరపున మాట్లాడాలని కోహ్లిని అభిమానులు ట్విట్టర్‌లో కోరారు. భారతదేశం మోకరిల్లడంపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు మరియు ఆటగాళ్లు తమ సొంత సహచరుడి కోసం నిలబడలేకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
గతేడాది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు జాతిపరంగా దుర్భాషలాడినప్పుడు, కెప్టెన్ హ్యారీ కేన్‌తో సహా ఆటగాళ్లు తమ సహచరులకు మద్దతుగా నిలిచారు. అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం షమీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై ఇంతవరకు స్పందించలేదు. తన తోటి ఆటగాళ్లు కూడా ఇంతవరకు ఈ విషయంపై మాట్లాడకపోవడం విచారకరం.
షమీకి మద్దతుగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిలిచాడు. జీన్యూస్‌తో మాట్లాడుతూ.. “మొహమ్మద్ షమీ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. ఆదివారం అతని విషయంలో మంచిరోజు కాదు. ఇలాంటి రోజు ప్రతీ ఆటగాడికి ఉంటుంది. కానీ, అతని కులం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి బలవుతున్నాడు” అని తెలిపాడు.
అయితే బాబర్, రిజ్వాన్‌లను పొగుడుతూ, కోహ్లీ వారిపై ప్రసంశల వర్షం కురిపించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. ప్రత్యర్థి ఆటగాళ్లను పొగిడే సమయం ఉందికానీ, సొంత జట్టు ఆటగాడి విషయంలో జరుగుతున్న ట్రోల్స్‌పై ఇంతవరకు మాట్లాడకపోవడమేంటని వాదిస్తున్నారు.
షమీ విషయంలో జరుగుతున్ననది సరైంది కాదు. ఈ మ్యాచులో దాదాపు అందరూ ఆటగాళ్లు విఫలమయ్యారు. కానీ, ఒక్క షమీనే లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటి వరకు మౌనం వహించిన కోహ్లి.. ఇప్పటికైనా షమీకి జరుగుతున్న దానిపై మాట్లాడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చివరికి బీసీసీఐ కూడా ఎటువంటి మద్దతును ప్రకటించలేదు. ఈ విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఇలాంటి విషయాలను కంట్రోల్ చేయకుంటే భవిష్యత్తులో ఆటలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి షమీ విషయంలో ఎలాంటి వైకరిని ప్రదర్శిస్తారో చూడాలి.
Captain @imVkohli should officially condemn both the attacks on Kashmiri students and the islamophobic abuse of Mohammed Shami that is happening in the aftermath of India’s loss to Pakistan today. But unfortunately, he and his teammates are only worried about black lives.
— Siddharth (@DearthOfSid) October 24, 2021
Hey Team India how about taking the knee for your team mate Mohd Shami? He does not deserve this vile hate & bigotry. @BCCI @imVkohli @ImRo45 @msdhoni https://t.co/tGsCnslB74
— Harneet Singh (@Harneetsin) October 24, 2021
Sanghis have started abusing Md. Shami after the loss.
After the racist attacks against few English players at Euro, the team came in support of them.
India’s hockey skipper Rani Rampal criticized casteist remarks against a teammate.
Your move, @imVkohli and everyone else. pic.twitter.com/38Rx1BaA52
— Abhishek Baxi (@baxiabhishek) October 24, 2021
Even I was part of #IndvsPak battles on the field where we have lost but never been told to go to Pakistan! I’m talking about ?? of few years back. THIS CRAP NEEDS TO STOP. #Shami
— Irfan Pathan (@IrfanPathan) October 25, 2021
After England’s black players were targeted post Euro 2020, Harry Kane had told the racist fans that they’re not needed.
Today, Mohammad Shami is being abused after India lost to Pakistan.
Time for India’s Hindu players to stand up for their Muslim teammate.#INDvPAK
— Parth MN (@parthpunter) October 24, 2021