Nicholas Pooran: నికోలస్ పూరన్ 10 సిక్సర్లు కొట్టాడు, 37 బంతుల్లో సెంచరీ చేశాడు, వీడియో చూడండి

Nicholas Pooran: విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్.. మరోసారి భౌలర్లపై జూలు విదిల్చాడు.

Nicholas Pooran: నికోలస్ పూరన్ 10 సిక్సర్లు కొట్టాడు, 37 బంతుల్లో సెంచరీ చేశాడు, వీడియో చూడండి
Pooran

Updated on: Mar 02, 2022 | 7:10 AM

Nicholas Pooran: విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్.. మరోసారి భౌలర్లపై జూలు విదిల్చాడు. భీకరమైన బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ట్రినిడాడ్‌లో జరుగుతున్న టీ10 లీగ్‌లో నికోలస్ పూరన్ అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించాడు. పూరన్ కేవలం 37 బంతుల్లో 101 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. తన సెంచరీలో పూరన్ 10 సిక్సర్లు, 6 ఫోర్లు బాది 84 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. ఇదే బ్యాటింగ్‌ శైలి ఐపీఎల్‌లో ప్రదర్శనిస్తే.. సన్‌రైజర్స్ రైజింగ్ మామూలుగా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా, నికోలస్ పూరన్ ట్రినిడాడ్ T10 లీగ్‌లో లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. లెదర్ బ్యాక్ జెయింట్స్ టీమ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ అబిస్ స్కార్చర్స్ 10 ఓవర్లలో 128 పరుగులు చేసింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెదర్‌బ్యాక్.. 9 బంతులు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయం నమోదు చేసింది. నికోలస్ పూరన్ సెంచరీ సాధించగా, కమిల్ పూరన్ అతనితో కలిసి 11 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేశాడు.

Also read:

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య