Watch Video: సింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. జట్టు స్కోర్ 100లోపే.. అయినా షారుక్ ఖాన్ జట్టుదే విజయం..

రెండు జట్ల కెప్టెన్లతో పాటు మరే బ్యాటర్స్ పరుగులు చేయలేకపోయారు. రాయల్స్ బ్యాటర్స్ పరిస్థితి నైట్ రైడర్స్ కంటే దారుణంగా ఉంది. కెప్టెన్ మినహా రాయల్స్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.

Watch Video: సింగిల్ డిజిట్ కే ఏడుగురు ఔట్.. జట్టు స్కోర్ 100లోపే.. అయినా షారుక్ ఖాన్ జట్టుదే విజయం..
Cricket Viral Video

Updated on: Sep 06, 2022 | 5:46 PM

క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఒక టీంకు వచ్చింది. ఓ దశలో విజయానికి సరిపడా స్కోర్ చేయలేక తంటాలు పడినా.. బౌలింగ్ లో రాణించి, ట్రోఫీని కైవసం చేసుకుంది. 3, 12, 3, 2, 8, 0, 1, 2 జట్టులోని 8 మంది బ్యాటర్లల స్కోరు.. అయితే ఈ పేలవమైన బ్యాటింగ్ ఉన్నప్పటికీ, జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. అది కూడా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ జట్టు కావడం గమనార్హం. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. కింగ్ ఖాన్, అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయారు.

ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 10 పరుగుల తేడాతో విజయం..

ఇవి కూడా చదవండి

నైట్ రైడర్స్ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. సోషల్ మీడియాలో టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన షారుఖ్.. ప్రతి విజయం ప్రత్యేకమైనదేనని, అయితే నైట్ రైడర్స్ మహిళల జట్టు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, కింగ్ ఖాన్ కుమారుడు ఆర్యన్, విజయం సాధించిన ఫోటోను పంచుకుంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

8 మంది బ్యాటర్స్ చేసిన పరుగులు 31..

మ్యాచ్ గురించి మాట్లాడితే, ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 100 పరుగులు చేసింది. నైట్ రైడర్స్‌లో 8 మంది బ్యాటర్స్ మొత్తం కలిసి 31 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ దియాండ్రా డాటిన్ మాత్రం 62 బంతుల్లో 59 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. డోటిన్ ఇన్నింగ్స్ ఆధారంగా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

బార్బడోస్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేదు..

101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ జట్టు మొత్తం ఓవర్లు కూడా ఆడలేక 18.4 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. అనిస్సా మహ్మద్ 16 పరుగులకు 3, హేలీ జెన్సన్ 18 పరుగులకు 2, షెనెటా 22 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. రాయల్స్ తరపున కెప్టెన్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా 46 పరుగులు సాధించింది. అంటే,