IND vs NZ: భారత్-కివీస్ వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. టాప్-5లో నలుగురు మనోళ్లే..

|

Nov 25, 2022 | 7:10 AM

IND vs NZ ODIs Records: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో ఒక్క కివీ బౌలర్ మాత్రమే చేరాడు.

IND vs NZ: భారత్-కివీస్ వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. టాప్-5లో నలుగురు మనోళ్లే..
Indian Cricket Team
Follow us on

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో ఒక్క కివీ బౌలర్ మాత్రమే చేరాడు. ఇటివరకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జవగల్ శ్రీనాథ్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా టాప్-5 బౌలర్ల జాబితాలో ఒకే ఒక్క న్యూజిలాండ్ ప్లేయర్‌ మాత్రమే చేరాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన 30 వన్డేల్లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 51 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 20.41. ఎకానమీ రేటు 3.93. భారత్-న్యూజిలాండ్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.

ఈ జాబితాలో భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌పై 31 వన్డేల్లో 39 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే బౌలింగ్ సగటు 27.84, ఎకానమీ రేటు 4.11గా ఉంది.

ఇవి కూడా చదవండి

భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కపిల్ దేవ్ మూడో స్థానంలో నిలిచాడు. కపిల్ 29 మ్యాచ్‌లలో 27.60 బౌలింగ్ సగటు, 3.44 ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు.

కివీస్ బౌలర్ కైల్ మిల్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మిల్స్ 29 వన్డేల్లో 32 మంది భారత ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 34.53, కానమీ రేటు 4.89గా నిలిచింది.

ఈ జాబితాలో టాప్-5లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కూడా ఉన్నాడు. జహీర్ న్యూజిలాండ్‌పై 22 ODIల్లో 27.73 బౌలింగ్ సగటు, 5.07 ఎకానమీ రేటుతో 30 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..