టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే బౌలర్లకు తడిచిపోతుంది.. ఎవరంటే.?

టీ20 ప్రపంచకప్ 2026లో టాప్ 5 అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ల లిస్టుపై ఓ సారి లుక్కేసేద్దాం. గత ప్రపంచకప్ నుంచి వాళ్ల విధ్వంసకర బ్యాటింగ్, నిలకడ, ప్రస్తుత ఫామ్ ఆధారంగా వీళ్లు క్రీజులోకి దిగితే బౌలర్లకు తడిచిపోతుంది. ఆ వివరలు ఇలా ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో భయం లేని బ్యాటర్లు వీరే.. బరిలోకి దిగితే బౌలర్లకు తడిచిపోతుంది.. ఎవరంటే.?
T20 World Cup

Updated on: Feb 05, 2026 | 9:38 AM

టీ20 ఫార్మాట్‌ను బ్యాటర్ల గేమ్‌గా పిలుస్తారు. 2026లో టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లుగా నిలిచే టాప్ 5 ఆటగాళ్లను ఇప్పుడు చూసేద్దాం. ఈ లిస్టులో ఎవరెవరున్నారో వాళ్ల విధ్వంసకర బ్యాటింగ్ సామర్థ్యం, ప్రదర్శన, గత టీ20 ప్రపంచకప్ నుంచి ముఖ్యంగా 2024 జూలై నుంచి వారి అద్భుతమైన ఫామ్ ఆధారంగా పరిశీలిస్తే..

నెంబర్ 5లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. గత 20 ఇన్నింగ్స్‌లలో 661 పరుగులు చేసి, 33.05 సగటు, 163.2 స్ట్రైక్ రేట్‌తో ఇంగ్లాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. భారత్‌లో ఐపీఎల్ ఆడటం వల్ల అతడికి.. ఆ కండిషన్లు బాగా తెలుసు.

న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టిమ్ సెఫర్ట్ నెంబర్ 4. గత 18 ఇన్నింగ్స్‌లలో 662 పరుగులు చేసి, 44.1 సగటు, 164.3 స్ట్రైక్ రేట్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతని బౌండరీ హిట్టింగ్ సామర్థ్యం పవర్ ప్లేలో జట్టుకు చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నెంబర్ 3. ఐపీఎల్, అంతర్జాతీయ టీ20లలో అద్భుతంగా రాణిస్తున్న సాల్ట్, గత 19 ఇన్నింగ్స్‌లలో 702 పరుగులు, 41.3 సగటు, 168.3 స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

ఆస్ట్రేలియాకు చెందిన పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ నెంబర్ 2. టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు డేవిడ్, గత 17 ఇన్నింగ్స్‌లలో 473 పరుగులు చేసి, 36.4 సగటు, 185.5 స్ట్రైక్ రేట్‌తో డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

చివరగా, ఈ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో టీమిండియా సంచలనం అభిషేక్ శర్మ ఉన్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత 37 ఇన్నింగ్స్‌లలో 1297 పరుగులు, 37.1 సగటు, 194.7 స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ ఆటగాడు కూడా అభిషేక్ శర్మ ఈ టీ20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంటాడని అంచనా వేశాడు.

ఇది చదవండి: ఎంత పని చేశావ్ హల్క్.! ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us