
R Praggnanandhaa : భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సరికొత్త రికార్డులతో అంతర్జాతీయ వేదిక పై మరోసారి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ యంగ్ క్రీడాకారుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందనలు తెలియజేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తింపుగా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (SDAT) తరఫున ముఖ్యమంత్రి విజయ్ రూ.50 లక్షల నగదు బహుమతిని (చెక్ రూపంలో) అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో ప్రజ్ఞానందతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులను సీఎం విజయ్ శాలువాతో సత్కరించి, ఇంతటి గొప్ప బిడ్డను దేశానికి అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించి టైటిల్ గెలవడం కేవలం తమిళనాడుకే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు గెలవాలని ఆకాంక్షించారు. తమిళనాడులోని యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేస్తామని సీఎం విజయ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందతో కాసేపు సరదాగా చెస్ ఆడారు. ఈ క్రమంలో ప్రజ్ఞానంద సీఎం విజయ్‌ను ఓడించాడు.
#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.
(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX
— ANI (@ANI) June 8, 2026
100 ఏళ్ల కంటే ఎక్కువ హిస్టరీ ఉన్న చెస్ గేమ్స్ లో మన దేశం నుంచి ఇలాంటి యువ కిరటం రావడం విశేషం. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాళ్లతో పోటీపడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఎత్తులతో ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో కూడా ప్రజ్ఞానంద తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు సీఎం చేతుల మీదుగా రూ.50 లక్షల పురస్కారం అందుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి