న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. భారత్‌తో బుధవారం జైపూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సీనియర్ స్పీడ్‌స్టార్ టిమ్ సౌథీ బ్లాక్ క్యాప్స్‌కు నాయకత్వం వహించనున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ”
“బుధవారం జరిగే ప్రారంభ మ్యాచ్‌కు టిమ్ సౌథీ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ కూడా రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉన్నారు” అని పేర్కొంది. ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కుడి తోడ-గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను టీ20 సిరీస్‌కి కూడా అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. మొదటి టీ20 మ్యాచ్ బుధవారం జైపూర్‌లో జరగనుంది. రెండో మ్యాచ్ నవంబర్ 19న రాంచీలో జరగనుంది. నవంబర్ 21న కోల్‌కత్తాలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇండియా, కివీస్ మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 25 ప్రారంభం కానుంది. మొట్టమొదటి డబ్యూటీసీ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టింటిన విలియమ్సన్.. పూర్తిస్థాయిలో ఈ సిరీస్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నాడట. మొదటి టెస్ట్ నవంబర్ 25న కాన్పూర్‌లో, రెండో టెస్ట్ డిసెంబర్ 3న ముంబైలో జరగనుంది. ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కివీస్ ఓడిపోయింది.
Kane Williamson will miss this week’s three-game T20 series against India as he prioritises preparing for the Test series starting on November 25 in Kanpur. #INDvNZ https://t.co/zff00W47ER
— BLACKCAPS (@BLACKCAPS) November 16, 2021