AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

149 బంతుల్లో 0 ఫోర్లు, సిక్సులు..! జిడ్డు కాదు.. తిలక్ వెరీ గుడ్డు!

దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ అద్భుత సహనంతో బ్యాటింగ్ చేశాడు. నార్త్ జోన్‌తో సెమీఫైనల్‌లో సౌత్ జోన్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్‌గా బాధ్యత తీసుకున్నాడు. ఏకంగా 149 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలి బౌండరీ కోసం 154 బంతులు ఆడాడు.

149 బంతుల్లో 0 ఫోర్లు, సిక్సులు..! జిడ్డు కాదు.. తిలక్ వెరీ గుడ్డు!
Tilak Varma
SN Pasha
|

Updated on: Aug 31, 2026 | 3:15 PM

Share

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రాపర్ టెస్ట్ క్రికెట్‌తో అదరగొడుతున్నాడు. బెంగళూరులో నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ప్రాణం పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు ఏకంగా 153 బంతులు ఆడి కూడా ఒక్కటంటే ఒక్క ఫోర్, సిక్స్ కూడా కొట్టలేదు. 149 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ, తన ఇన్నింగ్స్‌‌లో తొలి ఫోర్ కొట్టేందుకు 154 బంతులు తీసుకున్నాడు.

ఈ నంబర్లు చూస్తుంటే తిలక్ వర్మ చాలా జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నాడని అనిపిస్తోంది కదూ. కానీ, అక్కడ పరిస్థితి వేరు. కేవలం 85 పరుగులకే సౌత్ జోన్ కీలక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా తిలక్ భారం మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. రిక్కీ భుయి 5, షేక్ రషీద్ 0, హిమతేజ 0 వంటి బ్యాటర్లు విఫలం అవ్వడంతో సౌత్ జోన్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

అందుకోసం తన అగ్రెసివ్ అప్రోచ్‌ను సైతం పక్కనపెట్టి చాలా సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా కూడా బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం సింగిల్స్, డబుల్స్ తోనే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 154వ బంతికి బౌండరీ బాదాడు. తిలక్ వర్మ సహనానికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా ఫిదా అయిపోయారు. ఇన్నింగ్స్ చూస్తే జిడ్డూ బ్యాటింగ్‌లా ఉన్నా.. అసలైన టెస్ట్ క్రికెట్ మజా అందులోనే ఉంది. ప్రస్తుతం సౌత్ జోన్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తిలక్, గోపాల్ క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇమ్మిగ్రేషన్ లేకుండానే ఢిల్లీ నుంచి విదేశీయులు జంప్!
ఇమ్మిగ్రేషన్ లేకుండానే ఢిల్లీ నుంచి విదేశీయులు జంప్!
అమ్మబాబోయ్.. గాలి నుంచి నీరు! శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం
అమ్మబాబోయ్.. గాలి నుంచి నీరు! శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం
అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే
అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే
సమంతకు సీమంతం.. సంప్రదాయలంటే ఎప్పుడూ గౌరవమే..
సమంతకు సీమంతం.. సంప్రదాయలంటే ఎప్పుడూ గౌరవమే..
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్..
చూడటానికే మాంసంలా.. కానీ పూర్తిగా వెజ్! సోయా చంక్స్ ఎలా చేస్తారు?
చూడటానికే మాంసంలా.. కానీ పూర్తిగా వెజ్! సోయా చంక్స్ ఎలా చేస్తారు?
శుక్ర అనుగ్రహం.. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో వీరికి విజయం పక్కా..!
శుక్ర అనుగ్రహం.. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో వీరికి విజయం పక్కా..!
రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్‌లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?
రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్‌లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?
బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా?..దేవుడే కాపాడాలి
బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా?..దేవుడే కాపాడాలి
స్టేషన్ మిస్ అయితే అదే టికెట్ పై వెనక్కి వెళ్లొచ్చా? రూల్స్ ఇవే
స్టేషన్ మిస్ అయితే అదే టికెట్ పై వెనక్కి వెళ్లొచ్చా? రూల్స్ ఇవే