IPL 2023: ఐపీఎల్‌ నుంచి ఆ 6గురు ఔట్.! లిస్టులో ధోని శిష్యుడితో పాటు మరో ఐదుగురు.. వారెవరంటే.?

|

Mar 01, 2023 | 8:06 AM

మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈలోపే ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది.

IPL 2023: ఐపీఎల్‌ నుంచి ఆ 6గురు ఔట్.! లిస్టులో ధోని శిష్యుడితో పాటు మరో ఐదుగురు.. వారెవరంటే.?
Ipl 2023
Follow us on

మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఈ టోర్నమెంట్ కోసం ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడని ప్లేయర్స్ అందరూ కూడా నెట్స్ తెగ కసరత్తులు చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈలోపే ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది. పలువురు స్టార్ ఆటగాళ్లను గాయాల బెడద వెంటాడుతోంది. దీని కారణంగా చాలామంది ప్లేయర్స్ లీగ్‌ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4గురు కీ ఆటగాళ్లు టోర్నమెంట్‌కు దూరం కాగా.. వారందరూ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన స్టార్ ప్లేయర్లే కావడం విశేషం. ఇంకొందరు ఆటగాళ్ల పరిస్థితి అయితే అసలు ఐపీఎల్‌లో పాల్గొంటారో లేదో అనేది సందేహంగా మారింది. మరో నెల రోజుల్లో వారంతా పూర్తిగా కోలుకుంటేనే ఐపీఎల్‌లో కనిపించే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటివరకు ఐపీఎల్ నుంచి ఔట్ అయిన ఆటగాళ్ల జాబితా ఏంటో తెలుసుకుందామా..

  • రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్):

ఈ ఐపీఎల్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కనిపించడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన పంత్.. ఇంకా కోలుకోవడానికి ఏడాదిపైనే పట్టొచ్చు. అందుకే ఈ సీజన్‌కు అతడు దూరం కానున్నాడు. పైగా పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

  • కైల్ జేమీసన్(చెన్నై సూపర్ కింగ్స్):

న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ వెన్ను నొప్పి కారణంగా గతేడాది జూన్‌లో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. తిరిగి పునరాగమనం చేయడానికి అతడు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేడు. అందుకే ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఈ కివీస్ పేసర్.

ఇవి కూడా చదవండి
  • ప్రసిద్ద్ కృష్ణ(రాజస్థాన్ రాయల్స్):

చీలమండ నొప్పి కారణంగా టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. అందుకే ఈ పేసర్ ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కనిపించడు.

  • జస్‌ప్రీత్ బుమ్రా(ముంబై ఇండియన్స్):

వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈసారి ఐపీఎల్‌కు దూరం కావడం దాదాపు ఖాయం. కాబట్టి ముంబై ఇండియన్స్‌కు ఈ యార్కర్‌ విజార్డ్‌ కూడా కనిపించడని చెప్పొచ్చు.

  • ప్యాట్ కమిన్స్(కోల్‌కతా నైట్ రైడర్స్):

టీమిండియాతో జరిగే సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమైన విషయం తెలిసిందే. అతడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున సిరీస్‌ను మధ్యలోనే వదిలేసి ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ నాటికి తిరిగి రావడం అనుమానమే.

  • జోష్ లిటిల్(గుజరాత్ టైటాన్స్):

ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాలని ఆశించిన ఐర్లాండ్‌కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ లిటిల్ తొడ కండరాలు పట్టేయడంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి నిష్క్రమించాడు. మార్చి నెలాఖరులోగా కోలుకుంటేనే ఐపీఎల్‌లో కనిపించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..