T20 World Cup 2021: గడిచిన రెండేళ్లలో మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూకుడు మీదున్న టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. ఇలా రెండు పరాజయాలతో టీ20 ప్రపంచకప్ 12నుంచి భారత్ బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియాతో బరిలోకి దిగాలంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరస్థితి ఉండేది. కానీ తాజాగా పాక్, న్యూజిలాండ్ జట్లు అలవోక విజయాలు ఇండియన్ క్రికెట్ లవర్స్‌ను నిరాశకు గురి చేశాయి.
ఒకప్పుడు టీమిండియాను పొగిడిన అభిమానులే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. రకరాల ఫన్నీ మీమ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు టీమిండియా ఎందుకు ఇలా మారింది.? వరుస పరాజయాలకు కారణం ఏంటన్న దానిపై చర్చసాగుతోంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం..
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు చేసింది. రోహిత్ శర్మను తొలగించి అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. తర్వాత రోహిత్ మూడో స్థానంలో, విరాట్ నాలుగో స్థానంలో వచ్చారు. దీంతో భారత బ్యాటింగ్ తడబడింది. అసలు ఈ మార్పులు ఎందుకు చేశారన్నదానిపై క్లారిటీ లేదు. 2019 వరల్డ్ కప్‌లోనూ ఇలాంటి పొరపాటే జరిగింది. ఆ సమయంలో టీమ్ ఇండియా నంబర్ ఫోర్ బ్యాట్స్ విఫలమయ్యాడు. ఫలితంగా సెమీస్‌లో భారత్ ఓటమి పాలైంది.
భారత ఓటమికి మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం పడింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చిన కోహ్లీ కూడా రాణించలేకపోయాడు. మిడిల్ ఓవర్‌లలో స్కోరును పెంచడంలో కోహ్లి గత కొన్ని మ్యాచ్‌ల నుంచి విఫలమవుతూ వస్తున్నాడు. ఇది కూడా జట్టుకు వ్యతిరేక పవనాలు వీయడానికి కారణంగా మారింది.
రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ టాస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే టాస్ ఓడడంతోనే కోహ్లీ నిరాశగా కనిపించాడు. టాస్ ఓడినా మ్యాచ్‌పై పట్టుసాధించేందుకు టీమిండియా ఎలాంటి ప్లాన్ బిని ప్రదర్శించలేదు. సాధారణంగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే యూఎఇ పిచ్‌లపై టాస్ ఓడడం జట్టుకు కాస్త వ్యతిరేకంగా మారడం సర్వసాధరణమై విషయం. కానీ అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యమవుతుంది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సన్నాహాల్లోని లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం, బౌలర్‌ను ఎప్పుడు? ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం కూడా టీమిండియా వైఫల్యానికి కారణంగా చెబుతున్నారు. బౌలర్స్‌ను రంగంలోకి దింపడంలోనూ కొత్తగా ఎలాంటి ప్రణాళికలు కనిపించలేదు.
ఇక టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అంతర్గత వ్యవహారలు కూడా కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా సెలక్టర్స్ ఈగో వల్ల కూడా ప్లేయర్స్ ఎంపికలో తప్పులు జరిగినట్లు పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లపై తీవ్రంగా విమర్శలు గుప్తిస్తున్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆటగాళ్లు ఆట కంటే ఎక్కువగా ప్రకటనలపై ఆసక్తిచూపిస్తున్నారు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక మరికొందరి వాదన ప్రకారం ఐపీఎల్ టీమిండియాను నాశనం చేస్తోందంటున్నారు. ఐపీఎల్‌లో విశ్రాంతి లేకుండా ఆటగాళ్లు ఆడడం వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయానికి ఫిట్‌నెస్ కోల్పోతున్నారని అభిప్రాయపడుతున్నారు.
Urmila Matondkar: ఊర్మిళకు కొవిడ్ పాజిటివ్.. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ఫ్యాన్స్‌కు పిలుపు..
Urmila Matondkar: ఊర్మిళకు కొవిడ్ పాజిటివ్.. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ఫ్యాన్స్‌కు పిలుపు..