IND vs AUS: RRR దెబ్బకు కంగారుల్లో కలకలం.. వైరల్‌గా మారిన సచిన్ ట్వీట్.. ఎందుకో తెలుసా?

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లపై టీమిండియా వెటరన్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు.

IND vs AUS: RRR దెబ్బకు కంగారుల్లో కలకలం.. వైరల్‌గా మారిన సచిన్ ట్వీట్.. ఎందుకో తెలుసా?
Sachin Tendulkar

Updated on: Feb 10, 2023 | 5:43 PM

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లపై టీమిండియా వెటరన్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్ సందర్భంగా సచిన్ ఓ ట్వీట్ చేశాడు. టీమిండియా త్రయాన్ని RRR గా అభివర్ణించాడు. సచిన్ ట్వీట్ చేస్తూ, “రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల త్రయం భారత్‌కు మొదటి టెస్టులో ఆధిక్యాన్ని అందించడంలో సహాయపడింది. రోహిత్‌ సెంచరీతో రాణించగా, ఆర్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

నాగ్‌పూర్ టెస్టు తొలి రోజు జడేజా, అశ్విన్‌ల జోడీ భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తు చేశారు. జడేజా, అశ్విన్‌లు 8 వికెట్ల భాగస్వామ్యంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

రెండో రోజు ముగిసిన ఆట..

రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. క్రీజులో జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో నిలిచారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం 144 పరుగులకు చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..