Andhra Pradesh: శ్రీవారి సేవకు ముస్లిం దరఖాస్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

| Edited By: TV9 Telugu

Feb 05, 2024 | 4:25 PM

Tirumala Tirupati: తిరుమలలో శ్రీవారి సేవ అనేది 2000లో ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు సేవలు అందించేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, తాను కూడా సేవలో పాల్గొంటానంటూ డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో నాయుడుపేటకు చెందిన ముస్లిం భక్తుడు హుస్సేన్ భాషా ఈవోను అభ్యర్థించాడు.

Andhra Pradesh: శ్రీవారి సేవకు ముస్లిం దరఖాస్తు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
Tirumala Tirupati
Follow us on

Tirumala Tirupati: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వెళ్లిన ముస్లిం మత గురువుకు వ్యతిరేకంగా మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా తిరుమలలో సేవ చేసేందుకు అనుమతివ్వాలని నాయుడుపేటకు చెందిన హుస్సేన్ భాష అనే ముస్లిం టీటీడీ ఈవోను కోరడంపై కొందరు అతివాద మత పెద్దలు మండిపడుతున్నారు. మరోవైపు వెంకటేశ్వరుడి సేవ చేస్తానంటూ వచ్చిన ముస్లిం భక్తుల అంకిత భావాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మెచ్చుకుంటున్నారు.

తిరుమలలో శ్రీవారి సేవ అనేది 2000లో ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు సేవలు అందించేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, తాను కూడా సేవలో పాల్గొంటానంటూ డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో నాయుడుపేటకు చెందిన ముస్లిం భక్తుడు హుస్సేన్ భాషా ఈవోను అభ్యర్థించాడు.

దానికి స్పందించిన ఈవో ధర్మారెడ్డి ముస్లిం భక్తుడి అభ్యర్థనపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా స్వచ్ఛంద సేవలో పాల్గొనేవారు TTDలోని వివిధ రంగాలకు విజిలెన్స్, ఆరోగ్యం, అన్నప్రసాదం, ఉద్యానవనం, వైద్యం, లడ్డూ ప్రసాదం, దేవాలయం, రవాణా, కల్యాణకట్ట, బుక్ స్టాల్స్‌ దగ్గర సేవ చేసుకోవాల్సి ఉంటుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో మాకు కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ముస్లింల అభ్యర్థనను బీజేపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ముస్లింలు ఇలా శ్రీవారి సేవకు ముందుకురావడం పట్ల భజరంగ్‌దళ్‌ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..