Virat Kohli: ‘ది కింగ్ ఈజ్ డెడ్’.. కోహ్లీని RCB మాజీ కోచ్ అంత మాట అనేశాడేంటి..!

|

Dec 31, 2024 | 12:53 PM

ది కింగ్ ఈజ్ డెడ్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలపై మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మాట ఇది. ఈ షాకింగ్ కామెంట్స్ అటు క్రికెట్ ప్రపంచాన్ని.. ఇటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను కలవర పెడుతున్నాయి.

Virat Kohli: ది కింగ్ ఈజ్ డెడ్.. కోహ్లీని RCB మాజీ కోచ్ అంత మాట అనేశాడేంటి..!
Kohli Oit
Follow us on

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్‌లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆఫ్‌సైడ్ ఆఫ్ బాల్‌తో ఇబ్బందులు ఎదుర్కుంటూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరుతున్నాడు విరాట్. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, మొదటి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించినప్పటికీ.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో నిరాశపరిచాడు. ఆఫ్‌సైడ్‌లో బ్యాట్‌కి ఆమడదూరంలో వచ్చే బంతులను ఎదుర్కుని.. అవుట్ అవుతున్నాడు. నాలుగో టెస్టులోనూ విరాట్ ఇదే తరహాలో ఔట్ కాగా.. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘ది కింగ్ ఈజ్ డెడ్’: సైమన్ కటిచ్

మెల్‌బోర్న్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కోహ్లీ మంచి టచ్‌లో కనిపించినా.. అది ఎంతోసేపు పట్టలేదు. మళ్లీ బ్యాట్‌కు ఆమడదూరం వచ్చిన ఆఫ్ లెంగ్త్ డెలివరీలకు ట్రై చేసి.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్, ఆర్‌సీబీ ఎక్స్ బ్యాటర్ సైమన్ కటిచ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. “ది కింగ్ ఇజ్ డెడ్. అతడు తడబడుతున్నాడు. రాజుగా బుమ్రా ఇప్పుడు బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ తన ఆటపై తానే నిరుత్సాహంతో ఉన్నాడు.” అని తెలిపాడు.

కాగా, తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ విరాట్ కోహ్లి ఫామ్ మరోసారి పడిపోయింది. స్టార్ బ్యాటర్ ఈ సిరీస్‌లో 27.83 సగటుతో 7 ఇన్నింగ్స్‌లలో 163 పరుగులు మాత్రమే చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన తాజా ఓటమితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ప్రస్తుతం 2-1తో వెనుకబడి ఉంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే.. టీమిండియా సిడ్నీ టెస్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..