23 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు.. 278 స్ట్రైక్‌రేట్‌తో దిమ్మతిరిగే ఇన్నింగ్స్.. బౌలర్ల ఎకానమీ చూస్తే పాపం అనాల్సిందే..

|

Aug 19, 2022 | 10:47 AM

Andre Russell: ఆండ్రీ రస్సెల్ తన తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో మరోసారి తన శైలిని చూపించి, బౌలర్లను భయపెట్టాడు.

23 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు.. 278 స్ట్రైక్‌రేట్‌తో దిమ్మతిరిగే ఇన్నింగ్స్.. బౌలర్ల ఎకానమీ చూస్తే పాపం అనాల్సిందే..
The Hundred Manchester Originals Player Andre Russell
Follow us on

ఆండ్రీ రస్సెల్.. బౌలర్లు భయపడే పేరు.. ఈ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తుంటే, బౌలర్లకు తలనొప్పి మొదలవుతున్నట్లే. రస్సెల్ బ్యాట్ అంటే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధులపై విరుచుకపడుతంటాడు. తాజాగా మరోసారి రస్సెల్ తన తుఫాను ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. కేవలం ఐదు బంతుల్లో రస్సెల్ సంచలనం సృష్టించాడు. అది మ్యాచ్‌పై ప్రభావం చూపింది. రస్సెల్ ఆ మ్యాచ్‌లో హీరోగా మారడంతోపాటు జట్టును కూడా గెలిపించాడు.

ఇంగ్లండ్‌ టోర్నీ ది హండ్రెడ్‌లో సదరన్ బ్రేవ్ వర్సెస్ మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో రస్సెల్ మాంచెస్టర్ తరపున ఆడుతున్నాడు. అతను తన తుఫాను శైలిలో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మరోవైపు సదరన్ జట్టు 84 బంతుల్లో 120 పరుగులకే ఆలౌటైంది. మాంచెస్టర్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఐదు బంతుల్లో 24 పరుగులు..

ఈ మ్యాచ్‌లో రస్సెల్ 23 బంతులు ఎదుర్కొని 64 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 278.26 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. అయితే చివరి ఐదు బంతుల్లో రస్సెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మైఖేల్ హొగన్ బౌలింగ్‌లో ఐదు బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాది జట్టుకు బలమైన స్కోరు అందించాడు. అంటే, అతను హొగన్ వేసిన చివరి ఐదు బంతుల్లో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. దీని ఆధారంగా, మాంచెస్టర్ జట్టు భారీ స్కోరును సాధిచింది. అది సర్దాన్ జట్టుకు సాధించడం అసాధ్యంగా నిలిచింది.

రస్సెల్ కాకుండా మరో ఇద్దరు మాంచెస్టర్ బ్యాట్స్‌మెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. మాంచెస్టర్ కెప్టెన్ జోస్ బట్లర్ తన ఐపీఎల్ ఫామ్‌ను ప్రదర్శించి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బట్లర్ IPL-2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతనితో పాటు, అతని ఓపెనింగ్ భాగస్వామి ఫిల్ సాల్ట్ కూడా తుఫాను బ్యాటింగ్ చేసి 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 38 పరుగులు చేశాడు. ఈ లక్ష్యం ముందు ప్రత్యర్థి జట్టు నిలవలేకపోయింది. ప్రత్యర్థి జట్టులో ఎవరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. ఆ జట్టు తరపున జార్జ్ గార్టెన్ అత్యధికంగా 25 పరుగులు చేశాడు. కెప్టెన్ జేమ్స్ విన్స్ 20 పరుగులు చేశాడు. పాల్ వాల్టర్ మూడు వికెట్లు పడగొట్టాడు.