Telugu News Sports News Cricket news The first one day cricket world cup tournament starts today 7th june in 1977 gavaskar scored 34 runs in 174 balls
One Day Cricket: మొట్టమొదటి వన్డే క్రికెట్ టోర్నమెంట్ కు 46 ఏళ్లు..ఒకే మ్యాచ్ ఆడిన ఇండియా ఎంత స్కోరు చేసిందో తెలుసా?
One Day Cricket: రెండు జట్లు.. 22 మంది ఆటగాళ్ళు..రెండు ఇన్నింగ్స్..ఐదురోజులు.. ఆడినా చివరికి విజయం ఎవరిదో తేలక చప్పగా ముగిసిపోయే ముగింపు. ఇప్పుడు ఎంతమందికో ప్రియమైనదిగా మారిపోయిన క్రికెట్ తొలినాళ్ళలో ఇలా ఉండేది.
One Day Cricket: రెండు జట్లు.. 22 మంది ఆటగాళ్ళు..రెండు ఇన్నింగ్స్..ఐదురోజులు.. ఆడినా చివరికి విజయం ఎవరిదో తేలక చప్పగా ముగిసిపోయే ముగింపు. ఇప్పుడు ఎంతమందికో ప్రియమైనదిగా మారిపోయిన క్రికెట్ తొలినాళ్ళలో ఇలా ఉండేది. తరువాత 1971లో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ పేరుతో 60 ఓవర్ల ఒక్కరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అప్పటి నుంచి క్రికెట్ ప్రేమికులూ పెరుగుతూ వచ్చారు. క్రికెట్ ప్రేమికులందరినీ ఉర్రూతలూగిస్తూ మొదటి వన్డే ప్రపంచ కప్ 1975లో ప్రారంభం అయింది. సరిగ్గా ఈ రోజు అంటే జూన్ 7 వ తేదీన మొదటి ప్రపంచకప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ మొదలైంది. ఇంగ్లాండ్ లో ఈ మొదటి వన్డే టోర్నీ జరిగింది. ఇందులో 8 జట్లు పాల్గొన్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. ఈ మొదటి ప్రపంచ కప్ క్రికెట్‌ను వెస్టిండీస్ క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్ లో 60 ఓవర్లతో మ్యాచ్ లు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ఇండియా నాకౌట్ దశను దాటలేకపోయింది. ఈ టోర్నీ విశేషాలు..
మొదటి ప్రపంచ కప్‌లో పాల్గొన్న 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు.
మొదటి బృందంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా మరియు తూర్పు ఆఫ్రికా జట్లు ఉన్నాయి. అదే విధంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండో గ్రూపులో ఉన్నాయి.
మొత్తం టోర్నమెంట్ 16 మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోనే 4 వేర్వేరు మైదానాల్లో నిర్వహించారు. ఫైనల్స్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగింది.
ఈ టోర్నమెంట్‌లో నాకౌట్‌కు ముందే భారత జట్టు నాకౌట్ అయింది.
మొదటి సెమీ-ఫైనల్ ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగింది
రెండవ సెమీ-ఫైనల్ న్యూజిలాండ్ – వెస్టిండీస్ మధ్య జరిగింది.
ఇందులో ఆసియా ఉపఖండం నుండి ఏ జట్టు కూడా సెమీ-ఫైనల్‌కు చేరుకోలేదు.
తుది మ్యాచ్ జూన్ 21 న వెస్టిండీస్ – ఆస్ట్రేలియా మధ్య జరిగింది.
వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో గెలిచింది.
ప్రపంచ కప్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు కారణాలతొ అందరికీ గుర్తుండిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డెన్నిస్ అమిస్ సెంచరీ చేశాడు. ప్రపంచ కప్‌లో ఇది మొదటి సెంచరీ.
ఇక ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ స్లో ఇన్నింగ్స్‌కు కూడా గుర్తుండిపోతుంది.
గవాస్కర్ చాలా నెమ్మదిగా ఆడి 174 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తమ్మీద ఈ మ్యాచ్ లో భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. 202 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
టీమిండియా 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచి సంచలనం రేపింది. ఆ తరువాత భారత ఉపఖండంలోనే కాకుండా ఆసియా దేశాల్లో క్రికెట్ ఒక పెద్ద క్రీడాంశగా ఎదిగిపోయింది. తరువాత ఇరవై ఓవర్ల పొట్టి క్రికెట్.. పలు లీగ్ లు ఇలా క్రికెట్ ప్రస్థానం విజయవంతంగా సాగిపోతూ వస్తోంది.