ODI Records: 6.1 ఓవర్లలో 6 వికెట్లు.. 2 మెయిడీన్లతో 6 పరుగులు.. 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన 19 ఏళ్ల ప్లేయర్..

|

Apr 22, 2023 | 4:17 PM

Thipatcha Putthawong: కొత్త యుగం క్రికెట్‌లో కొత్త టాలెంటెడ్ ప్లేయర్ ఆవిర్భవిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ ప్లేయర్ తన అత్యత్తమ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరించింది. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ ప్లేయర్.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించి, ఏఖంగా 6 వికెట్లను పడగొట్టింది.

ODI Records: 6.1 ఓవర్లలో 6 వికెట్లు.. 2 మెయిడీన్లతో 6 పరుగులు.. 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన 19 ఏళ్ల ప్లేయర్..
Thipatcha Putthawong
Follow us on

మహిళా క్రికెటర్లు కూడా పురుషులతో సమానంగా ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త యుగం క్రికెట్‌లో కొత్త టాలెంటెడ్ ప్లేయర్ ఆవిర్భవిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ ప్లేయర్ తన అత్యత్తమ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరించింది. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ ప్లేయర్.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించి, ఏఖంగా 6 వికెట్లను పడగొట్టింది. థాయ్‌లాండ్‌లో పర్యటించిన జింబాబ్వే జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 19 ఏళ్ల స్పిన్నర్ తిపాచా పుతావాంగ్ ప్రమాదకరంగా బౌలింగ్‌ చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు ఇన్నింగ్స్‌ను పేకమేడలా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

బ్యాంకాక్‌లో బుధవారం (ఏప్రిల్ 19) జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ కేవలం 154 పరుగులకే సవాల్ విసిరింది. 50 ఓవర్ల ఈ చిన్న సవాలును ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే జట్టును తిపాచా పుత్తావాంగ్ అద్భుత బౌలింగ్‌తో చీల్చి చెండాడింది. దీంతో 24.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో థాయ్‌లాండ్‌ మహిళల జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాటు తిపాచా కూడా చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే ఆరో అత్యుత్తమ బౌలర్‌గా రికార్డ్..

తిపాచా పుతావాంగ్ మొత్తం 6.1 ఓవర్లలో 6 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో తిపాచా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ప్రపంచ ఆరో బౌలర్‌గా అవతరించింది. దీంతో పాటు ఈ ఘనత సాధించిన తన దేశానికి చెందిన తొలి బౌలర్‌గా నిలిచింది.

తిపాచా అద్భుత బౌలింగ్‌తో వన్డే క్రికెట్‌ చరిత్రలో థాయ్‌లాండ్‌ మహిళల జట్టు పేరు నమోదైంది. ఇంతకు ముందు థాయ్‌లాండ్‌ మహిళల జట్టు ఈ తరహా ప్రదర్శన చేయలేదు. ఓవరాల్ ఈ రికార్డ్ గురించి మాట్లాడితే, మహిళల వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన రికార్డు పాకిస్థాన్ బౌలర్ సాజిదా షా పేరిట ఉంది. 2003లో 8 ఓవర్లలో 4 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. ఇప్పటి వరకు ఏ మహిళా బౌలర్ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు.

41 ఏళ్ల రికార్డు బద్దలు..

తిపాచా తన అద్భుతమైన బౌలింగ్‌తో దాదాపు 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 14, 1982న న్యూజిలాండ్ బౌలర్ జాకీ లార్డ్ ఆక్లాండ్‌లో భారత మహిళల జట్టుపై 8 ఓవర్లలో 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తిపాచా తన బౌలింగ్ ప్రదర్శనతో ఈ రికార్డును బద్దలు కొట్టింది. తద్వారా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఎనిమిదో అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.

తిపాచా పుతావాంగ్ కెరీర్..

19 ఏళ్ల తిపాచా పుతావాంగ్ ఇప్పటివరకు కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. అలాగే 24 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..