Test Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. టెస్ట్ ఫార్మాట్ తొలి 25 ఏళ్లలో ఏకైక డబుల్ సెంచరీ.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?

|

Feb 07, 2023 | 5:23 PM

Test Cricket History: తొలి 25 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం మూడు జట్లు మాత్రమే క్రికెట్ ఆడేవి. అందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడాయి.

Test Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. టెస్ట్ ఫార్మాట్ తొలి 25 ఏళ్లలో ఏకైక డబుల్ సెంచరీ.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
Test Cricket Records
Follow us on

Test Cricket 19th Century History: ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు భారత్, ఆస్ట్రేలియా టీంలు సిద్ధమయ్యాయి. అయితే, అంతరిచిపోతాయనుకున్న టెస్ట్ ఫార్మాట్.. ప్రస్తుత రోజుల్లో మరలా తన వైపునకు అభిమానులకు తిప్పుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అసలు టెస్ట్ క్రికెట్ మొదలైన రోజుల్లో ఎలా ఉండేది, జనాల్లోకి ఎప్పుడు దూసుకొచ్చిందనే విషయాలపై ఓ లుక్ వేద్దాం.. దాదాపు 146 సంవత్సరాల క్రితం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్. 1877 మార్చిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 12 ఏళ్లపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఈ విధంగా అనేక టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆ రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేది ఈ రెండు జట్లే కావడం గమనార్హం. ఆ తర్వాత 1889లో దక్షిణాఫ్రికా కూడా ఈ జాబితాలో చేరింది.

టెస్టు క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే తొలి 25 ఏళ్లలో మొత్తం 69 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలో ఇంగ్లండ్ పాల్గొంది. ఆస్ట్రేలియాతో 61 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో 8 మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లిష్ జట్టు 35 మ్యాచ్‌లు గెలవగా, ఆస్ట్రేలియా 24 విజయాలు సాధించింది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా ఈ రౌండ్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాల్సి వచ్చింది.

తొలి 25 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు జట్లే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాయి. ఈ రెండు జట్ల ఆటగాళ్లు కూడా ఆధిపత్యం చెలాయించడం సహజంగానే కనిపిస్తోంది. ఆ కాలంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

తొలి 25 ఏళ్లలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్..

మొదటి 25 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వెయ్యికి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లు 9 మంది ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లు, ఇంగ్లండ్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ కాలంలో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్ గ్రెగొరీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 29 మ్యాచ్‌ల్లో 52 ఇన్నింగ్స్‌ల్లో 1365 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 28.43కాగా, అత్యధిక స్కోరు 201గా నిలిచింది. క్రికెట్‌లో తొలి 25 ఏళ్లలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ ఈయనే కావడం విశేషం.

25 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 100కి పైగా వికెట్లు తీసిన బౌలర్లు కేవలం ఐదుగురే..

తొలి 25 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 100కి పైగా వికెట్లు తీసిన బౌలర్లు కేవలం ఐదుగురు మాత్రమే. వీరిలో ఇంగ్లండ్‌ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు బౌలర్లు ఉన్నారు. ఈ కాలంలో అత్యధిక వికెట్లు స్పిన్నర్ జానీ బ్రిగ్స్ పేరిట నమోదయ్యాయి. అతను 33 మ్యాచ్‌లలో 49 ఇన్నింగ్స్‌లలో 17.75 బౌలింగ్ సగటుతో 118 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..