టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం కొందరు సోషల్ మీడియా వేదికగా టీం ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని టార్గెట్ చేశారు. ఓటమికి మహ్మద్ షమీనే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే షమీకి మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, రాజకీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు అభిమానులు కూడా పేసర్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో మహ్మద్ షమీ పాక్ అభిమానికి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సెంగ్ రూమ్‌కు వెళ్తున్నారు. అయితే గ్యాలరీలోని ఓ పాక్ అభిమాని జట్టు మొత్తాన్ని దూషించాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా మౌనంగా వెళ్లిపోయినా ఆ మాటలు విన్న షమి స్పందించాడు. పాక్ అభిమాని వద్దకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కెప్టెన్ ధోనీ అక్కడికి వచ్చి షమీని లోపలికి తీసుకెళ్లాడు. అభిమానులు ఈ వీడియోను పోస్టు చేస్తూ దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇలాంటిదని అండగా నిలుస్తున్నారు.
Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP
— निंदाTurtle (@Tawishz) October 25, 2021
మరి కొందరు షమీ గతంలో ఆడిన ఆటను గుర్తు చేస్తున్నారు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన క్షణాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 వరల్డ్ కప్‌లో ఆప్ఘానిస్తాన్పై హ్యాట్రిక్ తీసిన వీడియోను పోస్టు చేస్తున్నారు. ఇలా మహ్మద్ షమీ మద్దతుగా నిలుస్తున్నారు.
You are our Proud, We stand with you#Shami #WeStandWithShami@MdShami11 ❤️pic.twitter.com/OHiU1XUaLv
— Basit Khaku (@BasitKhaku1) October 25, 2021
Read Also.. Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..