IPL 2024: ఆ గట్టునుంటావా.. నాగన్న.. ఈ గట్టుకొస్తావా.. ట్రేడ్‌తో మారుతోన్న ఐపీఎల్ టీంల రూపురేఖలు..

|

Nov 24, 2023 | 7:47 PM

IPL 2024: IPL ఫ్రాంచైజీలు తమలో తాము ఆటగాళ్లను కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటాయి. ట్రేడ్ లేదా స్వాప్ ద్వారా, జట్లు ఎవరైనా ఇద్దరు ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు లేదా ఒక జట్టు నేరుగా తన ఆటగాళ్లలో ఒకరిని మరొక జట్టుకు నగదు ఒప్పందంలో విక్రయించవచ్చు. దీని కోసం, ఫ్రాంచైజీ ఐపీఎల్ గవర్నర్స్ కౌన్సిల్ తుది అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కొనాలనుకున్నా లేదా అమ్మకం చేయాలనుకుంటున్న ఆటగాడి సమ్మతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

IPL 2024: ఆ గట్టునుంటావా.. నాగన్న.. ఈ గట్టుకొస్తావా.. ట్రేడ్‌తో మారుతోన్న ఐపీఎల్ టీంల రూపురేఖలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు IPL వేలంలో మొదటిసారి నామినేట్ కానున్నారు. అయితే, కొంతమంది లెజెండ్‌లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ రిచ్ లీగ్‌లోకి తిరిగి రానున్నారు. IPL 2024 వేలానికి ముందు, రాబోయే వేలంలో IPL అత్యధిక బిడ్ పొందే ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
Follow us on

IPL 2024 Trade: ప్రపంచ కప్ ముగిసిన తర్వాత,IPL గురించి చర్చలు తీవ్రమయ్యాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందు, కొన్ని జట్లు తమ ఆటగాళ్లను ట్రేడింగ్‌తో ఆటగాళ్లను కొనుగోలు లేదా అమ్మకం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, IPL ట్రేడ్ లేదా స్వాప్ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఎవరు ట్రేడింగ్‌లోకి వస్తారు, ఆ నియమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

IPL ట్రేడ్ అంటే ఏమిటి?

IPL ట్రేడ్ ప్రకారం, IPL ఫ్రాంచైజీలు తమలో తాము ఆటగాళ్లను కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటాయి. ట్రేడ్ లేదా స్వాప్ ద్వారా, జట్లు ఎవరైనా ఇద్దరు ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు లేదా ఒక జట్టు నేరుగా తన ఆటగాళ్లలో ఒకరిని మరొక జట్టుకు నగదు ఒప్పందంలో విక్రయించవచ్చు. దీని కోసం, ఫ్రాంచైజీ ఐపీఎల్ గవర్నర్స్ కౌన్సిల్ తుది అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కొనాలనుకున్నా లేదా అమ్మకం చేయాలనుకుంటున్న ఆటగాడి సమ్మతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అనేక జట్లు ఒక ఆటగాడిని కొనుగోలు చేయాలనుకుంటే, అది ఆ ఆటగాడి ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా, ఏ ఫ్రాంచైజీ అయినా.. దాని ఐకాన్ ప్లేయర్‌ను ట్రేడింగ్‌లోకి తీసుకరాదు.

ఇవి కూడా చదవండి

IPL ట్రేడింగ్ గడువు..

IPL 2024 కోసం నిర్వహించే వేలం కోసం, అన్ని జట్లు నవంబర్ 26 లోగా తమ రిటెన్షన్ జాబితాను పంపాలి. అన్ని జట్లు నవంబర్ 26 వరకు మాత్రమే ఆటగాళ్లను ట్రేడ్ చేయగలవు. ఈ రిటెన్షన్ లిస్ట్, ట్రేడ్ లిస్ట్ నుంచి టీమ్ పైనల్ పర్స్ బ్యాలెన్స్ కూడా తెలుస్తుంది.

IPL 2024లో ఇప్పటి వరకు ట్రేడ్ అయిన ఆటగాళ్లు..

రొమారియో షెపర్డ్ (రూ. 50 లక్షలు) – లక్నో సూపర్ జెయింట్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు

దేవదత్ పడికల్ (రూ. 7.5 కోట్లు) – రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్‌కు

అవేష్ ఖాన్ (రూ. 10 కోట్లు) – లక్నో సూపర్ జెయింట్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు

హార్దిక్ పాండ్యా ట్రేడ్..

హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో ఒకసారి జట్టును గెలిపించాడు. ఒకసారి ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ అతని ట్రేడ్ వార్తలు బయటకు వస్తున్నాయి. హార్దిక్ తిరిగి ముంబైకి వెళ్లవచ్చని, ఆ తర్వాత ముంబై జట్టు జోఫ్రా ఆర్చర్‌ను గుజరాత్‌కు ఇవ్వవచ్చని చెబుతున్నారు. అయితే, దాని గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. ముంబై ఇండియన్స్ వద్ద 16 కోట్ల రూపాయల డీల్‌తో హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావడానికి తగినంత బడ్జెట్ కూడా లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..