AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 69 బంతులాడిన తొలి జట్టు.. కట్‌చేస్తే.. ఒక్క బంతి కూడా ఆడకుండానే గెలిచిన రెండో జట్టు.. కారణం తెలిస్తే షాకే..

Cambodia vs Indonesia: ఒక జట్టు 69 బంతులు ఆడగా, మరో జట్టు ఇన్నింగ్స్ కూడా ప్రారంభం కాలేదు. కానీ మ్యాచ్ ఫలితం వచ్చింది. క్రికెట్‌లో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అలాంటి మ్యాచ్ ఎక్కడ జరిగిందోనని తప్పక తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం.. ఈ మ్యాచ్ కంబోడియా వర్సెస్ ఇండోనేషియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ నవంబర్ 23న బాలిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంత గందరగోళం జరిగింది.

Cricket: 69 బంతులాడిన తొలి జట్టు.. కట్‌చేస్తే.. ఒక్క బంతి కూడా ఆడకుండానే గెలిచిన రెండో జట్టు.. కారణం తెలిస్తే షాకే..
Cambodia Vs Indonesia
Venkata Chari
|

Updated on: Nov 24, 2023 | 8:11 PM

Share

Cambodia vs Indonesia: క్రికెట్ అంటేనే ఉత్కంఠ.. చివరి బాల్ వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఏ క్షణంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఊహించడం కష్టం. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి విచిత్రాలు, రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి వింతే జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక జట్టు 69 బంతులు ఆడగా, మరో జట్టు ఇన్నింగ్స్ కూడా ప్రారంభం కాలేదు. కానీ మ్యాచ్ ఫలితం వచ్చింది. క్రికెట్‌లో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అలాంటి మ్యాచ్ ఎక్కడ జరిగిందోనని తప్పక తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం.. ఈ మ్యాచ్ కంబోడియా వర్సెస్ ఇండోనేషియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ నవంబర్ 23న బాలిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంత గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఇండోనేషియా బంతిని ఆడకుండానే విజేతగా ప్రకటించింది. అయితే, అసలు ఇండోనేషియా జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండా ఎందుకు విజేతగా ప్రకటించారు? అసలు కారణం ఏంటంటే..

ఇండోనేషియా-కంబోడియా మ్యాచ్‌లో గందరగోళం..

ఇండోనేషియా, కంబోడియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. కంబోడియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే, 12వ ఓవర్ మూడో బంతికి గందరగోళం నెలకొంది. ఆ తర్వాత మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇండోనేషియా బౌలర్ ధనేష్ శెట్టి వేసిన బంతికి లుక్మాన్ బట్ అవుట్ అయ్యాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాట్స్‌మెన్ చాలా కోపంగా కనిపించాడు. బ్యాట్స్‌మన్ లుక్మాన్ బట్‌పై ఇచ్చిన నిర్ణయంతో అతని రన్నింగ్ పార్ట్‌నర్ కూడా కోపంగా ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు పెవిలియన్‌కు తిరిగి వచ్చారు. దీని తర్వాత కాంబోడియా జట్టు ఆడేందుకు నిరాకరించింది.

ఇండోనేషియా విజయం..

కంబోడియా ఈ చర్యను చూసిన మ్యాచ్ రిఫరీ ఇండోనేషియాను విజేతగా ప్రకటించారు. ఈ సిరీస్‌ని 4-2తో ఇండోనేషియా కైవసం చేసుకుంది. బాలి వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇండోనేషియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో టీ20లో ఇండోనేషియా మళ్లీ ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20లో కంబోడియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో టీ20లో ఇండోనేషియా 104 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 5వ మ్యాచ్‌లో కంబోడియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరో మ్యాచ్‌లో, ఇండోనేషియా మళ్లీ విజేతగా ప్రకటించారు. ఎందుకంటే కంబోడియా మైదానం నుంచి వాకోవర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..