తొలి మ్యాచులోనే పాకిస్తాన్‌కు చుక్కలు.. ధోనికి కూడా సాధ్యం కాని రికార్డుతో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కీపర్

|

Aug 06, 2021 | 5:33 AM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టు 15 న ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించారు.

తొలి మ్యాచులోనే పాకిస్తాన్‌కు చుక్కలు.. ధోనికి కూడా సాధ్యం కాని రికార్డుతో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా కీపర్
Wicket Keeper
Follow us on

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టు 15 న ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని రిటైర్మెంట్ చేసినప్పటి నుంచి చాలా మంది ఆటగాళ్లు భారత క్రికెట్ జట్టు తదుపరి వికెట్ కీపర్ కోసం రేసులోకి వచ్చారు. ఇందులో రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే ఓ టీమిండియా వికెట్ కీపర్ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి మ్యాచ్‌లో, ధోనీ కూడా సాధించలేని ఓ ఘనతను సాధించాడు. ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అద్భుతంగా అరంగేట్రం చేసిన ఈ భారత వికెట్ కీపర్ గురించి తెలుసుకుందాం.

నరేన్ తమ్హనే 1931 ఆగస్టు 4 న ముంబైలో జన్మించాడు. అతను 1954-55లో పాకిస్తాన్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. జనవరి 1 నుంచి 4 వరకు ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. అతను వికెట్ కీపర్‌గా ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో మూడు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు ఉన్నాయి. తమ్హనే కూడా తరువాత భారత జట్టు సెలక్షన్ ప్యానెల్‌లో భాగం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఫస్ట్ క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ కోసం జట్టులో లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేసిన ప్యానెల్‌లో తమ్హనే ఉన్నారు.

వికెట్ కీపర్‌గా..
ముంబైకి చెందిన నరేన్ తమ్హనే భారత క్రికెట్ జట్టు తరపున 21 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 27 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు అజేయంగా నిలిచినప్పటికీ, అతను 10.22 సగటుతో మొత్తం 225 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతను ఏకైక అర్ధ సెంచరీ (54 నాటౌట్) చేశాడు. వికెట్ కీపర్‌గా టెస్ట్ క్రికెట్‌లో అతను 35 క్యాచ్‌లు అందుకున్నాడు. అలాగే 16 స్టంప్‌లు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికొస్తే, 93 మ్యాచ్‌లు ఆడిన నరేన్ తమ్హనే.. 18.23 సగటుతో 1459 పరుగులు సాధించాడు. 16 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నరేన్ అత్యధిక స్కోరు 109 నాటౌట్‌గా నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను వికెట్ కీపర్‌గా 253 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో 174 క్యాచ్‌లు కాగా, 79 స్టంపింగ్‌లు ఉన్నాయి.

Also Read: IND vs ENG: రెండో రోజు ఆట వర్షార్పణం.. ఇంకా 58 పరుగుల వెనుకంజలోనే టీమిండియా

Tokyo Olympics 2020: కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ టీం.. నేడు భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్