
ఇన్నాళ్లు గాయంతో బాధపడ్డాడు. కీలక మ్యాచులకు దూరమయ్యాడు. అలాగే ఐపీఎల్ మొదటి భాగంలోనూ ఆడలేదు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో నేను సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయనెవరో కాదు… టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్. పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌తో రెడీ అయినట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) తెలిపింది. ఈమేరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. దీంతో ఐపీఎల్ రెండవ విడత మ్యాచులకు రెడీ అయ్యాడు. అలాగే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే ఛాన్స్ దక్కనుంది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే.
ఈ మేరకు శ్రేయాస్ అయ్యర్ ట్విట్టర్‌లో తన పునరాగమనంపై రాసుకొచ్చాడు. ‘గాయం నుంచి కోలుకున్నాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమరానికి రెడీ. మ్యాచులకు ఇక సిద్ధం. నా బ్యాట్ మాత్రమే ఇక మాట్లాడుతుంది’ అంటూ శ్రేయస్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ, గాయంతో ఐపీఎల్‌కు దూరమవడంతో అతడి స్థానంలో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ కం కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Ready to go out there. Ready to fight. Ready to play ⚔️ Thank you to everyone who’s helped me recover ? Time to let the bat talk now ? pic.twitter.com/VNDWS7hilo
— Shreyas Iyer (@ShreyasIyer15) August 11, 2021
India Vs England: టీమిండియాలో రెండు మార్పులు.. మిడిల్ ఆర్డర్ మరింత బలం.. ఎవరెవరంటే.?