IND vs ENG: రెండో రోజు రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. 364 పరుగులకు భారత్ ఆలౌట్..!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది.

IND vs ENG: రెండో రోజు రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. 364 పరుగులకు భారత్ ఆలౌట్..!
Ind Vs Eng Ravindra Jadeja

Updated on: Aug 13, 2021 | 7:27 PM

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయింది. 276 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోతూ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో రాహుల్ 129 పరుగులు(250 బంతులు, 12 ఫోర్లు, 1 సిక్స్), పంత్ 37 పరుగులు, జడేజా 40 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు, రాబిన్ సన్ 2 వికెట్లు, మార్క్ వుడ్, ఆలీ చెరో వికెట్ పడగొట్టారు.

కాగా తొలిరోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(83; 145 బంతుల్లో 11×4, 1×6) ఆకట్టుకున్నాడు. తొలిసారి లార్డ్స్ మైదానంలో ఆడుతున్న రోహిత్ మొదట్లో ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు. ఈక్రమంలోనే తన 13వ అర్థ శతకం సాధించాడు. ఆతర్వాత అవుట్ అయ్యాడు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ 276/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (127 బ్యాటింగ్: 248 బంతుల్లో 12×4, 1×6), అజింక్య రహానె (1 బ్యాటింగ్: 22 బంతుల్లో) క్రీజ్‌‌‌‌లో ఉన్నారు. చెతేశ్వర్‌ పుజారా(9; 23 బంతుల్లో 1×4) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ క్రీజులోకి రాగా మరో వికెట్‌ పడకుండా భారత్‌ జాగ్రత్తగా ఆడింది. అయితే కోహ్లీ మాత్రం పరుగులు సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆతర్వాత 40పరుగులకు అవుట్ అయ్యాడు.

Also Read: 13 బంతులు.. 400 స్ట్రైక్ రేట్‌‌తో బ్యాటింగ్.. బౌలర్లకు దడ పుట్టించిన బ్యాట్స్‌మెన్.. క్రికెట్ లీగ్‌లో ఓ జట్టు ప్రపంచ రికార్డు.. ఎక్కడంటే?

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు.. వారెవరంటే?