India vs Srilanka: టీమిండియా ఆటగాళ్ల ‘గెస్సింగ్‌ గేమ్‌’ షో.. ఆకట్టుకున్న శిఖర్, పృథ్వీషా..!

|

Jul 02, 2021 | 9:07 AM

శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ జట్టు.. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈమేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉన్నారు.

India vs Srilanka: టీమిండియా ఆటగాళ్ల ‘గెస్సింగ్‌ గేమ్‌’ షో.. ఆకట్టుకున్న శిఖర్, పృథ్వీషా..!
Shikhar And Prithvi In Guessing Game
Follow us on

India vs Srilanka: శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ జట్టు.. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈమేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉన్నారు. ఈమేరకు ఆటగాళ్లను ఒత్తిడికి గురి కాకుండా బీసీసీఐ డిఫరెంట్ గా ఆలోచించి, సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తోంది. ఇలా రోజుకో రకమైన ఆలోచనతో ఆటగాళ్లను ఉత్సామపరిచేందుకు సిద్ధమైంది. తాజాగా టీమిండియా సీనియర్ ప్లేయర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ శిఖర్ ధావన్ తోపాటు యంగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీషా లతో గెస్సింగ్ గేమ్ ఆడించింది. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమేరకు గేమ్ రూల్స్ ను యంగ్ బ్యాట్స్ మెన్ వివరించగా, శిఖర్‌ ధావన్‌ గెస్సింగ్ గేమ్ ఆడాడు. అనంతరం ధావన్.. పృథ్వీషాతో ఆడుకున్నాడు. ఇలా సరదాగా సాగింది ఈ వీడియో. వీరి తరువాత సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ను గెస్సింగ్ గేమ్ ఆడేందుకు నామినేట్ చేశారు.

ఐపీఎల్ లో శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా లు ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ఓపెనింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సూర్యకుమార్‌, ఇషాన్‌ లు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. కామెంట్లతో ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. కోహ్లీ లేకుండా టీమిండియా ఆటగాళ్లు ఎంత సరదాగా ఉన్నారు అంటూ ఒకరు, శిఖర్ ధావన్ సారథ్యంలో తొలి సిరీస్ గెలవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేశారు. కోహ్లీ ని ఎందుకు ఈవిషయంలోకి లాగుతారబ్బా అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మీరూ ఆ వీడియోను చూడండి:

Also read:

Jasprit Bumrah: భార్యతో నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తియ్యు..! టీమిండియా పేసర్ పై నెటిజన్ల ట్రోల్స్..

Wimbledon 2021 Day 4 Highlights: సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!

IND vs ENG: అచ్చం ధోనీలానే.. మిస్టర్ కూల్ కాదిక్కడ.. మిస్ కూల్ షె‎ఫాలీ వర్మ అంటోన్న నెటిజన్లు..!

Wimbledon 2021: వింబుల్డన్ ‘స్పైడర్ మ్యాన్‌’ ని చూశారా..? నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదుగా!