వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. T20 ప్రపంచ కప్ 2024 తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 4 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశం ఉంది. జూన్ 5 నుంచి టీమిండియా టీ20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆతర్వాత టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయని సమాచారం. అలాగే మూడో మ్యాచ్‌లో భారత జట్టు అమెరికాతో తలపడనుంది. టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ పోటీలను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. లీగ్ స్థాయి మ్యాచ్‌లు యూఎస్ఏలో జరగనున్నాయి. సూపర్-8 మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్ మ్యాచ్ కు కూడా కరేబియన్ దేశం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
News coming that Pakistan team in Group A for the T20 World Cup 2024, alongside arch-rivals India, Ireland, USA, & Canada 🔥🏏#T20WC2024 #PAKVSIND #cricketnews pic.twitter.com/M5lZaIiaR6
ఇవి కూడా చదవండి— 𝑨𝙗𝒅𝙪𝒍𝙡𝒂𝙝 𝙎𝒖𝙡𝒕𝙖𝒏⁵⁶ (@Abdullahs_56) January 4, 2024
Suryakumar Yadav is in the running to claim Men’s T20I Cricketer of the Year for a second straight year, though three men stand in his way 👀
More 👉 https://t.co/2oVnJD2hdo pic.twitter.com/r4ThLRSVRI
— ICC (@ICC) January 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.