
Vihaan Malhotra Century: అండర్ 19 ప్రపంచకప్ 2026లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ఫైనల్ దిశగా సాగుతోంది. అయితే, ఇప్పటి వరకు టీమిండియా ఆటగాళ్లను వేధించిన ఓ సమస్యకు చెక్ పడింది. వైభవ్ సూర్యవంశీ లేదా కెప్టెన్ ఆయుష్ మాత్రే కానేకాదు.. అండర్-19 ప్రపంచ కప్ 2026లో టీమిండియా తరపున తొలి సెంచరీ సాధించిన ప్లేయర్ ఎవరో తెలుసా..? మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ విహాన్ మల్హోత్రా నుంచి ఈ సెంచరీ రావడం గమనార్హం. టోర్నమెంట్‌లో నిలకడగా ప్రదర్శన ఇస్తున్న భారత జట్టు లీగ్ దశలో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. కానీ, సూపర్ సిక్స్ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లోనే వైస్-కెప్టెన్ విహాన్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా ఆ నిరీక్షణకు ముగింపు పలికాడు. ఆతిథ్య జింబాబ్వేపై విహాన్ 107 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా 352 పరుగుల బలమైన స్కోరును నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
జనవరి 27వ తేదీ మంగళవారం బులవాయోలో జరిగిన సూపర్ సిక్స్ రౌండ్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. బలమైన ఆరంభం తర్వాత, కేవలం 101 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విహాన్ క్రీజులోకి వచ్చాడు. అక్కడి నుంచి అతను భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది అత్యధిక స్కోరుకు తీసుకెళ్లాడు. అభిజ్ఞాన్ కుండుతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా పంచుకున్నాడు.
ఈ సమయంలో, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ టోర్నమెంట్‌లో తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు. తరువాత, 49వ ఓవర్‌లో, విహాన్ దానిని అద్భుతమైన బౌండరీతో సెంచరీగా మార్చాడు. 104 బంతులను ఎదుర్కొని ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆ విధంగా, ఈ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా విహాన్ నిలిచాడు. అతను చివరి ఓవర్ వరకు ఆడి 107 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. దీంతో భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..