Ajinkya Rahane: భారత టెస్టు వైస్ కెప్టెణ్ అజింక్య రహానే గత కొంత కాలంగా పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. 2020 నుంచి రహానే 27.36 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. దీంతో రహానే పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రహానే ఆటతీరు మార్చుకోవాలంటే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే తాఆజగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రహానే మంచి ఆటతీరును ప్రదర్శించాడు. కీలక ఇన్నింగ్స్‌ను ఆడిన రహానే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసి తన ఫామ్‌ను మరోసారి చాటి చెప్పాడు.
దీంతో గతకొన్ని రోజులుగా తన ఆటతీరుపై వస్తోన్న విమర్శలకు రహానే బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తోన్న విమర్శల గురించి తెలుసని చెప్పిన రహానే.. అవేమీ పట్టించుకోకుండా జట్టు గెలుపులో తన పాత్ర ఏమిటన్నదే ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. తన గురించి జనం చాలా మాట్లాడుకుంటున్నారని చెప్పిన రహానే.. అయితే అది తనకు సంతోషమేనని చెప్పాడు. ఈ విషయంపై తానేమీ అసహనానికి గురి కావడం లేదని, ఎందుకంటే గుర్తింపు ఉన్నవారు, ప్రముఖుల గురించి అందరూ మాట్లాడుతారని చెప్పుకొచ్చాడు.
ఈ విషయమై రహానే ఇంకా మాట్లాడుతూ.. ‘నేను జట్టుకు ఏం చేశాననేది అన్నింటికంటే ముఖ్యం. నేను, పుజారా సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాం. ఒత్తిడిలో ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. అందుకే గత మ్యాచ్ సమయంలో బయటి విమర్శలను పట్టించుకోకుండా పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాం. మన చేతుల్లో లేనిదాని గురించి ఏమీ చేయలేం’ అని రహానే తనపై వచ్చిన విమర్శలపై ధీటుగా స్పందించాడు.
Coins Collection Hobby: తన హాబీతో అబ్బుర పరుస్తున్న సామాన్యుడు.. ఏకంగా 180 దేశాలకు చెందిన..