
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈ నెల 23న అంటే ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఓ క్రికెట్ మ్యాచ్ అనే కంటే ఓ మినీ యుద్ధంలా సాగుతుంది. ఇరు దేశాల ఆటగాళ్లు గెలవడానికి ప్రాణం పెట్టేస్తారు. గత మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా రెండు టీమ్స్ ప్లేయర్ల కూడా కొత్త జోష్‌తో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ బరిలోకి దూకుతారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ ఆటగాళ్లు.. పాక్ నుంచి దుబాయ్‌కి చేరుకున్నారు. తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్, ఇండియాతో డూ ఆర్ డై మ్యాచ్ కోసం రెడీ అవుతోంది.
ఇక మరోవైపు ఇండియా, బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయంతో రెట్టించిన ఉత్సాహంతో పాక్‌తో మ్యాచ్‌కు సంసిద్ధంగా ఉంది. ఈ రెండు జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించినప్పటికీ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పుతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఆ ఒక్క మార్పు ఏంటి? ఏ ప్లేయర్‌ను పక్కనపెట్టే అవకాశం ఉందో చూద్దాం.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగింది. వీరిలో షమీ, హర్షిత్ రాణా అద్బుతంగా బౌలింగ్ చేశారు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా బాగా బౌలింగ్ చేశారు. కానీ, క్వాలిటీ స్పిన్నర్, చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 10 ఓవర్లు వేసినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కుల్దీప్‌ను పక్కనపెట్టి, వరణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? బంగ్లా ప్లేయర్ కష్టానికి కరిగిపోయిన రోహిత్, షమీ! ఇంత మంచోళ్లేంటయ్యా మీరు..
అయితే పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై కుల్దీప్‌కు మంచి రికార్డ్ ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు కాబట్టి కుల్దీప్‌ను టీమ్‌లో కొనసాగిస్తారా? లేక వరుణ్‌ను టీమ్‌లోకి తీసుకొస్తారా? అనేది వేచి చూడాలి. అయితే పిచ్ కండీషన్‌ని బట్టి కూడా ప్లేయింగ్ ఎలెవన్ మార్పు ఉండొచ్చు. కానీ, రోహిత్ శర్మ మాత్రం విన్నింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. చూడాలి మరి ఆదివారం మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులతో ఆడుతుందో. మార్పు చేసినా, చేయకపోయినా పాక్‌పై కచ్చితంగా గెలవాలని మాత్రం భారత క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచానా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, హర్షిత్ రాణా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..